Business Idea: వేసవి కాలంలో ఐస్ క్రీమ్ పార్లర్ల కంటే మొబైల్ ఐస్ క్రీమ్ ట్రక్కులు మంచి లాభాలను అందిస్తాయి. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్, ఫ్రీజర్లు, బ్రాండింగ్, స్టాక్‌తో కలిపి సుమారు 10 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్లని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ డిమాండ్‌ను వ్యాపారంగా మార్చుకోవాలనుకునే వారికి "ఐస్ క్రీమ్ ట్రక్" ఒక వినూత్నమైన, లాభదాయకమైన మార్గం. సాధారణంగా ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాలంటే ఒకే చోట ఉండాలి. కానీ ఐస్ క్రీమ్ ట్రక్ ద్వారా మనం కస్టమర్ల వద్దకే వెళ్ళవచ్చు.
25
పెట్టుబడి, నిర్వహణ
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు 10 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో సెకండ్ హ్యాండ్ ట్రక్ కొనుగోలుకు 2-5 లక్షలు, ఫ్రీజర్లు, వెహికల్ డిజైనింగ్‌కు మరికొంత, మిగిలిన మొత్తాన్ని స్టాక్, లైసెన్సుల కోసం కేటాయించవచ్చు. సాధారణ సైకిల్ మీద అమ్మే ఐస్ క్రీమ్స్ ఒకే బ్రాండ్‌కు పరిమితమవుతాయి, కానీ ట్రక్ ద్వారా 15-20 రకాల బ్రాండ్లను, విభిన్న ఫ్లేవర్లను కస్టమర్లకు అందించవచ్చు.
35
లాభాల శాతం
ఐస్ క్రీమ్ వ్యాపారంలో లాభాలు బ్రాండ్‌ను బట్టి మారుతుంటాయి. పేరున్న కార్పొరేట్ బ్రాండ్స్ అమ్మితే 10 శాతం నుంచి 15 శాతం వరకు మార్జిన్ లభిస్తుంది. అదే కొత్తగా వస్తున్న బ్రాండ్స్ లేదా లోకల్ క్వాలిటీ బ్రాండ్స్ అయితే 25 శాతం నుంచి 30 శాతం వరకు లాభం పొందవచ్చు. రోజుకు ఒక లక్ష రూపాయల అమ్మకాలు జరిగితే, అందులో దాదాపు 25 వేల రూపాయల వరకు నికర లాభం ఉండే అవకాశం ఉంది.
ఐస్ క్రీమ్ అంటే కేవలం వేసవిలోనే తినేది అన్న భావన ఇప్పుడు మారింది. ప్రజలు ఏడాది పొడవునా వీటిని ఇష్టపడుతున్నారు. సమ్మర్‌లో అమ్మకాలు విపరీతంగా ఉంటే, మిగిలిన కాలాల్లో కొంచెం తక్కువగా ఉండవచ్చు, కానీ వ్యాపారం మాత్రం ఆగదు.
55
ప్రతీ నెలా చక్కటి లాభాలు..
అంతేకాకుండా, సీజన్‌కు అనుగుణంగా ట్రక్కులో ఇతర ఆహార పదార్థాలను కూడా చేర్చుకోవచ్చు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే యువతకు, తక్కువ రిస్క్ ఉన్న ఈ ఐస్ క్రీమ్ ట్రక్ ఐడియా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.