Stock Market: ప్రస్తుత కరెక్షన్ లో మంచి వాల్యూషన్ లో అందుబాటులో ఉన్నాయి టాప్ స్టాక్స్. ఈ కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలు, గ్రోత్ పొటెన్షియల్ గురించి నిపుణుల విశ్లేషణ ఇక్కడ చూడవచ్చు.
డిఫెన్స్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగాన్ డాక్, సబ్ మెరైన్ల తయారీ సామర్థ్యాన్ని 6 నుండి 11కు పెంచుకుంది. సుమారు రూ. 90,000 కోట్ల విలువైన ఆర్డర్లు పైప్‌లైన్ లో ఉన్నాయి. షిప్ బిల్డింగ్ రంగంలో ప్రభుత్వ ప్రాధాన్యత పెరగడం ఈ కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్.
25
సోలార్ ఇండస్ట్రీస్ (Solar Industries)
డిఫెన్స్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారు చేసే ఈ కంపెనీ, ఇప్పుడు హై-టెక్ మిస్సైళ్ల తయారీలోకి ప్రవేశించింది. వీరు తయారు చేసిన 'నాగాస్త్ర-1' లాయిటరింగ్ మిస్సైల్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం రూ. 21,000 కోట్ల ఆర్డర్ బుక్ తో కంపెనీ పటిష్టంగా ఉంది.
35
డిక్సన్ టెక్నాలజీస్ (Dixon Technologies)
అసెంబ్లీ ప్లేయర్ నుండి కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ గా ఈ కంపెనీ రూపాంతరం చెందుతోంది. కెమెరా మాడ్యూల్స్ వంటి వాటి తయారీకి అప్రూవల్స్ పొందింది. 2028 నాటికి రూ. 1 లక్ష కోట్ల రెవెన్యూ టార్గెట్ తో మేనేజ్మెంట్ అగ్రెసివ్ గా ముందుకు వెళ్తోంది.
యూరప్, యూకే ట్రేడ్ డీల్స్ వల్ల ఈ ఆటో యాన్సిలరీ కంపెనీకి భారీ ప్రయోజనం చేకూరనుంది. హెల్త్ కేర్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ రంగాల్లోకి కూడా వ్యాపారాన్ని విస్తరిస్తోంది.
55
గ్రో (Groww)
వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో సరికొత్త పుంతలు తొక్కుతున్న గ్రో, జెన్-జీ (Gen-Z) ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వీరు కేవలం బ్రోకరేజ్ మాత్రమే కాకుండా ఏఎంసి(AMC), క్రెడిట్ బిజినెస్ లోకి కూడా ప్రవేశించి అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నారు.
ముఖ్య గమనిక: ఇవి కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి లేదా వ్యక్తిగతంగా రీసెర్చ్ చేయండి.