Business Ideas: ఇంట్లోనే ఉంది డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా.? మహిళల కోసం ఈ బిజినెస్ ఐడియాస్..

Published : Apr 19, 2026, 05:00 PM IST

Business Ideas: మహిళలు తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంటి నుండే ఎలా సంపాదించవచ్చో ఇక్కడ తెలుసుకోండి. టైలరింగ్, బ్యూటీషియన్ సర్వీసెస్, హోమ్ మేడ్ ఫుడ్, ట్యూషన్ల వంటి బిజినెస్ ఐడియాలు..

PREV
15
ఖాళీ సమయంలో ఏదైనా వ్యాపారం..

చాలా మంది మహిళలు ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూనే, ఖాళీ సమయంలో ఏదైనా వ్యాపారం చేయాలని ఆకాంక్షిస్తుంటారు. కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాకుండా, సొంత గుర్తింపు కోసం కూడా మహిళలు ఈ మార్గాలను ఎంచుకోవచ్చు.

25
నైపుణ్యం ఆధారిత వ్యాపారాలు

టైలరింగ్, బోటిక్: డ్రెస్ మేకింగ్, బ్లౌజులు కుట్టడం, చీరలకు ఫాల్స్ వేయడం వంటివి ఎప్పుడూ డిమాండ్ ఉండే పనులు. చిన్న రిపేర్లు చేసి పెట్టడం ద్వారా కూడా వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.

బ్యూటీషియన్ సర్వీసెస్: బ్యూటీ పార్లర్ కోర్సులు చేసి ఇంటి వద్దే సేవలు అందించవచ్చు. పార్లర్ పెట్టుకోకపోయినా, కస్టమర్ ఇంటికే వెళ్లి సర్వీస్ ఇచ్చే పద్ధతి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉంది.

క్లాసులు నిర్వహించడం: మీకు మ్యూజిక్, డాన్స్ లేదా వంటలు (కుకరీ) వచ్చి ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో క్లాసులు తీసుకోవచ్చు.

35
ఆహార రంగంలో అవకాశాలు

హోమ్ మేడ్ ఫుడ్: ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఇళ్ల నుండి కూడా ఫుడ్ పికప్ చేస్తున్నాయి. జొన్న రొట్టెలు, పులిహోర, పరోటాలు వంటివి తయారు చేసి అపార్ట్మెంట్ వాసులకు విక్రయించడం ఒక మంచి మార్గం.

కుండ బిర్యానీ: ఇంటి నుండే కుండ బిర్యానీ తయారు చేసి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా విక్రయించి మంచి లాభాలు గడించవచ్చు.

45
విద్య, ఇతర సేవలు

ట్యూషన్లు: మీకు పట్టున్న సబ్జెక్టులలో చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా మంచి ఇన్కమ్ పొందవచ్చు.

ఆన్లైన్ బిజినెస్: వాట్సప్ లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా చీరలు, ఇతర వస్తువులను రీసెల్లింగ్ చేయడం ద్వారా కమిషన్ పొందవచ్చు.

ట్రైనింగ్ సంస్థలు: ALEAP(ఎలీప్), SETWIN(సెట్విన్) వంటి సంస్థలు మహిళలకు వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తూ, వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి.

55
ముఖ్యమైన సూచనలు

తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి: మొదట తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో వ్యాపారాన్ని ప్రారంభించి, అది కుదురుకున్నాక విస్తరించడం ఉత్తమం.

నాణ్యత(Quality): వ్యాపారం ఏదైనా నాణ్యతను పాటిస్తేనే కస్టమర్లు పెరుగుతారు.

బాధ్యతలు, ఆరోగ్యం: ఫ్యామిలీ బాధ్యతలు, మీ ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని పని వేళలను ప్లాన్ చేసుకోవాలి.

ఈజీ మనీ వద్దు: త్వరగా డబ్బు వచ్చేస్తుందనే మోసపూరితమైన ఆఫర్లకు దూరంగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories