LUMPSUM: మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు మొత్తం నగదును లంసమ్‌గా కాకుండా, కొంత మొత్తాన్ని స్వల్ప కాలానికి స్టాగర్డ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం మంచిది. అదెలాగంటే ఈ స్టోరీలో చూసేయండి.
లంసమ్ (Lumpsum) పెట్టుబడి ద్వారా దీర్ఘకాలంలో ఎంత సంపదను సృష్టించవచ్చో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు వివరించారు. ఎస్ఐపి (SIP) చేయలేని వారికి, ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా ఒకేసారి నగదు చేతికి వచ్చేవారికి లంసమ్ పెట్టుబడి ఒక అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు.
25
లంసమ్ పెట్టుబడి - సంపద సృష్టి
చారిత్రక డేటా ఆధారంగా 12 శాతం నుంచి 15 శాతం వార్షిక రిటర్న్స్‌ను ప్రామాణికంగా తీసుకుని ఆయన వివిధ పెట్టుబడి మొత్తాలకు లభించే రాబడిని వివరించారు:
రూ. 2 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 34 లక్షలు వస్తుంది.
రూ. 3 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 51 లక్షలు వస్తుంది.
రూ. 5 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 85 లక్షలు వస్తుంది.
రూ. 7 లక్షలపెట్టుబడి మొత్తంతో 12 శాతం రిటర్న్స్‌తో రాబడి ప్రకారం 25 సంవత్సరాల కాలంలో రూ. 1.19 కోట్లు వస్తుంది.
35
కీలక సూచనలు, వ్యూహాలు:
సమయం ప్రాముఖ్యత: లంసమ్ పెట్టుబడిలో మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉంటే, కాంపౌండింగ్ పవర్ వల్ల అంత ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది.
లంసమ్ వర్సెస్ ఎస్ఐపి: ఒకేసారి పెద్ద మొత్తం ఉన్నప్పుడు దానిని ఎస్ఐపిగా మార్చడం కంటే లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయడమే మెరుగైన రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే లంసమ్ మొత్తంలో మొదటి రోజు నుండే పూర్తి నగదు మార్కెట్‌లో ఉంటుంది.
మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు మొత్తం నగదును లంసమ్‌గా కాకుండా, కొంత మొత్తాన్ని స్వల్ప కాలానికి స్టాగర్డ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం మంచిది.
55
వాస్తవిక అంచనాలు
పెట్టుబడిపై రిటర్న్స్ విషయంలో 12 శాతం నుంచి 15 శాతం వరకు ఆశించడం రియలిస్టిక్‌గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ (20-25 శాతం) అంచనా వేసి గోల్ రీచ్ అవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.
గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.