60 ఏళ్లు దాటిన మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే.. పైగా గ్యారెంటీ రిటర్న్స్!

Published : Aug 17, 2025, 03:45 PM IST

Best Saving Schemes: 60 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS), బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎన్సీడీ పెట్టుబడి పెట్టితే రిటైర్మెంట్‌లో స్థిర ఆదాయం, భద్రత, గ్యారెంటీ రాబడి అందుతాయి.

PREV
15
మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే

Best Saving Schemes: 60 ఏళ్లు దాటిన మహిళలు, ముఖ్యంగా రిటైర్ అయిన వారి జీవితంలో మూలధన భద్రత, స్థిరమైన ఆదాయం అత్యంత కీలకం. వీటి వచ్చే ఆదాయంతో రోజువారీ ఖర్చులు, వైద్య అవసరాలు, తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. 

సరైన పెట్టుబడులతో మాత్రమే రిటైర్మెంట్ సమయంలో రిస్క్ లేని జీవితాన్ని గడపవచ్చు. అలా టెన్షన్ లేని లైఫ్ లీడ్ చేయాలంటే.. 60 ఏళ్లు దాటిన మహిళలు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS), బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి ప్రభుత్వ హామీ పథకాలు ఎంతో ఉపయోగకరం. ఇవి మహిళలకు ఆర్థిక భద్రత, స్థిర ఆదాయాన్ని అందిస్తాయి.

25
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) – సురక్షిత పెట్టుబడి ఎంపిక

భారతదేశంలో 60 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఒకటి. ప్రభుత్వం హామీ ఇచ్చే ఈ పథకంతో సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును పొందవచ్చు.

ప్రధాన ఫీచర్లు:

  • త్రైమాసిక వడ్డీ చెల్లింపు: స్థిరమైన నగదును సులభంగా పొందగలరు.
  • పెట్టుబడి పరిమితి: ఒక్క వ్యక్తి గరిష్టంగా ₹ 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • మెచ్యూరిటీ పొడిగింపు: ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత మరో ఐదేళ్లపాటు పొడిగించవచ్చు.
  • పన్ను రాయితి : సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అందుతుంది.
  • SCSS ద్వారా రిటైరీలకు రిస్క్-ఫ్రీ, స్థిర ఆదాయ పన్ను ఆదా చేసే అత్యుత్తమ పెట్టుబడి ఎంపికగా నిలుస్తుంది.
35
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) – నెలవారీ స్థిర ఆదాయం

నెలవారీ హామీ ఆదాయానికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఓ బెస్ట్ ఆప్షన్. ఇది సురక్షితమైన పెట్టుబడి అవకాశం. ఈ పథకం నెలవారీ స్థిర వడ్డీని అందిస్తూ, మూలధనాన్ని తాకకుండా స్థానిక ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. 

ఈక్విటీ లేదా హైబ్రిడ్ ఉత్పత్తులతో పోలిస్తే రాబడి తక్కువ అయినప్పటికీ, ప్రభుత్వ హామీతో మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి మూలధన భద్రతను నిర్ధారిస్తుంది. భారీ రాబడి కంటే భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే మహిళలకు POMIS చాలా బాగా ఉపయోగపడుతుంది.

45
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs)బెస్ట్ ఆప్షన్. ఎలాంటి టెన్షన్ లేకుండా ఆర్థిక భద్రత, ఫిక్స్డ్ అమౌంట్ అందించే అత్యంత నమ్మకమైన పెట్టుబడి ఎఫ్ డీ. చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు మార్కెట్ రేట్ల కంటే 0.25% నుండి 0.75% ఎక్కువ వడ్డీని అందిస్తాయి. కొంతమంది మహిళలు అధిక రాబడిని కోరినట్లయితే, AAA-రేటెడ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDs) ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. NCDలు బ్యాంక్ FDs కన్నా కొంచెం రిస్క్ కానీ, అధిక రేటింగ్ ఉన్న వాటిలో పెట్టుబడులు పెడితే.. డిఫాల్ట్ రిస్క్ తక్కువగా ఉంటుంది.

55
భద్రత, లిక్విడిటీ సమతుల్యం

ఉత్తమైన రిటైర్మెంట్ పెట్టుబడిలో దీర్ఘకాల స్థిర ఆదాయ పథకాలు, అత్యవసర పరిస్థితుల కోసం లిక్విడ్ నిధులు సమతుల్యంగా ఉండాలి. ఉదాహరణకు SCSS, POMIS ద్వారా నిరంతర స్థిర ఆదాయం లభిస్తుంది, 

అలాగే లిక్విడ్ క్యాష్ లేదా షార్ట్-టర్మ్ డిపాజిట్లలో పెట్టుబడులు తక్షణ నగదు అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. 60 ఏళ్లు దాటిన మహిళలు వడ్డీ రేట్ల మార్పులు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అవసరాలను పరిగణించి తమ పెట్టుబడులను తరచుగా సమీక్షించాలి. ఇది రిటైర్మెంట్ కార్పస్‌ను సురక్షితంగా, ఇబ్బంది లేకుండా ఉంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories