డబ్బు ఆదా చేయడానికి ప్రభుత్వ పొదుపు పథకాలు చాలా సురక్షితమైనవి. ఈ పథకాలు వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రతను అందిస్తాయి. మీరు సంపాదించే డబ్బును సేవింగ్స్ అకౌంట్స్ లో ఉంచితే సాధారణ వడ్డీ మాత్రమే వస్తుంది. అదే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ డబ్బును పెంచుకోవచ్చు.
డిసెంబర్ 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ PPF, NSC, KVP వడ్డీ రేట్లను సవరించింది. గత నాలుగు త్రైమాసికాలుగా వడ్డీ రేటు మారలేదు. ప్రస్తుతం మీరు సేవింగ్స్ చేయడానికి బెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం రండి.
2025లో PPF, NSC, సుకన్య సమృద్ధి యోజన వంటి పొదుపు పథకాలు మీ డబ్బు దాచుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్. వీటి వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందిస్తుంది. 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ కు మంచి రిటర్న్స్ వస్తాయి. SCSSలో డిపాజిట్లు చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC) 5 సంవత్సరాలకు స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. NSC అకౌంట్స్ సాధారణంగా నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు మీరు సేవింగ్స్ చేయొచ్చు. వీటిలో 5 సంవత్సరాలకు మీరు పెట్టే డబ్బుకు స్థిర వడ్డీ రేటును అందిస్తాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం కలిగి ఉంటుంది. పన్ను ప్రయోజనాలతో కూడిన దీర్ఘకాలిక పొదుపు పథకం కావున మీ డబ్బుకు మంచి లాభాలు వస్తాయి.
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ఆడపిల్లల కోసం ఒక మంచి పొదుపు పథకం. ఇది పన్ను ప్రయోజనాలు అందించడంతో పాటు అధిక వడ్డీ రేటును అందిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన అనేది మహిళలకు లేదా బాలికల కోసం ఒకేసారి పెట్టుబడి పెట్టే చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇందులో మధ్యలోనే డబ్బు వెనక్కు తీసుకున్నా స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP) ఒక నిర్ణీత కాలంలో మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది. రికరింగ్ డిపాజిట్ (RD) స్థిర వడ్డీ రేటుతో క్రమం తప్పకుండా నెలవారీ డిపాజిట్లను అనుమతిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా స్థిర వడ్డీ రేటును అందించడంతో పాటు సంపాదించిన వడ్డీపై ఒక నిర్దిష్ట పరిమితి వరకు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రభుత్వ పథకాలు డబ్బు సేవింగ్స్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్.