2025 సంవత్సరం మొదటి నెలలోనే కొత్త కార్ల సందడి ప్రారంభం కానుంది. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో అనేక కార్లు, SUVలు విడుదల కానున్నాయి. జనవరి నెలలోనే 10 కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి.
Hyundai Creta EV
హ్యుండై నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Creta EVని ఎక్స్‌పోలో విడుదల చేయనుంది. ఇది భారతదేశంలో హ్యుండై నుండి వస్తున్న మొదటి మాస్ మార్కెట్ EV. Creta EV కోనా మోడల్ నుండి పవర్‌ట్రెయిన్, బ్యాటరీని రిఫరెన్స్ గా తీసుకుంటుంది. డిజైన్ ICE Cretaని పోలి ఉంటుంది.
KIA Syros
KIA ఇటీవలే భారతదేశంలో Syros సబ్-కాంపాక్ట్ SUVని విడుదల చేసింది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్యలో ఉంటుంది. Syros విభిన్నమైన డిజైన్, అనేక ఫీచర్లు, 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5L డీజిల్ ఇంజిన్‌లతో వస్తుంది.
Mahindra XEV 9e
XEV 9e అనేది XUV 700 ఎలక్ట్రిక్ కూపే వెర్షన్. ఇది INGLO ఆర్కిటెక్చర్‌తో తయారైంది. దీని ధర రూ.21.90 లక్షలు. ట్రిపుల్ స్క్రీన్ క్లస్టర్ ఈ కారు ప్రత్యేకత.
Maruti e Vitara
మారుతి సుజుకి తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు eVitara. దీన్ని ఇటీవలే మిలాన్‌లో ఆవిష్కరించారు. జనవరి 2025లో ఎక్స్‌పోలో భారతదేశంలో విడుదల కానుంది.
Tata Harrier EV
టాటా హారియర్ EV జనవరి 17, 2025న విడుదల కానుంది. ఈ కారును సియెర్రా, సఫారీ EVలతో పాటు ఎక్స్‌పోలో ఆవిష్కరిస్తారు. డిజైన్ ICE వెర్షన్‌ను పోలి ఉంటుంది.
Mahindra BE 6
మహీంద్రా తన ఎలక్ట్రిక్ SUVలు BE 6, XEV 9e లను ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. BE 6 ధర రూ.18.79 లక్షలు. ఈ EV మహీంద్రా కొత్త INGLO ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైంది.
Mahindra XUV 3XO EV
మహీంద్రా XUV 3XO ఆధారంగా EVని తయారు చేస్తోంది. ఇది XUV 400 కంటే చిన్నది. XUV 400లోని పవర్‌ట్రెయిన్‌నే ఇందులోనూ ఉపయోగించనున్నారు.
Tata Safari EV
టాటా మోటార్స్ నుండి వస్తున్న మరో EV Safari EV. ఇది Harrier EV లాంటి ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. AWD ఫీచర్ ఉంటుంది.
All New Kodiaq
స్కోడా కొత్త Kodiaqని 2025 ప్రారంభంలో విడుదల చేయనుంది. ఇది కొత్త డిజైన్, ఫీచర్లతో వస్తుంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 190 bhp, 320 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
MG Cyberster
MG మోటార్ Cyberster ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేయనుంది. ఇది 77 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. AWD ఫీచర్ ఉంటుంది.
అద్భుతమైన ఫీచర్లు, డిజైన్లతో వస్తున్న ఈ కార్లన్నీ జనవరి నెలలోనే విడుదల కానున్నాయి. ఇది కార్లు ఇష్టపడే వారికి నిజంగా ఆనందకరమైన విషయం. కొత్త కారు తీసుకోవాలనున్న వారు ఎక్స్‌పో 2025 అయ్యే దాకా వెయిట్ చేసి తీసుకోవడం మంచిది.