AC: ఎలాంటి ఏసీ కొనాలో అర్థమవ్వట్లేదా.? కంపెనీ ఏదైనా సరే ఈ పాయింట్స్‌ గుర్తు పెట్టుకుంటే చాలు.

Published : Mar 01, 2025, 12:24 PM IST

ఎండకాలం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది పాత కూలర్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇక కాస్త డబ్బులున్న వారు అయితే ఏసీ కొనుగోలు చేసేందుకు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఏసీ కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
17
AC: ఎలాంటి ఏసీ కొనాలో అర్థమవ్వట్లేదా.? కంపెనీ ఏదైనా సరే ఈ పాయింట్స్‌ గుర్తు పెట్టుకుంటే చాలు.

ఏసీ కొనుగోలు చేయాలనే ఆలోచన రాగానే చాలా మంది చేసే పని ఇంటర్నెట్‌లో తెగ వెతికేయడం. యూట్యూబ్ రివ్యూలు, ఇన్‌స్టా పేజీలు ఇలా తెగ సెర్చ్‌ చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సైజ్‌ సైంటిస్ట్‌గా మారిపోతుంటారు. మార్కెట్లో ఉన్న రకరకాల కంపెనీల్లో ఏ కంపెనీ ఏసీ కొనుగోలు చేయాలని తెగ ఆలోచిస్తుంటారు. అయితే కంపెనీ ఏదైనా మీరు కొనుగోలు చేసే ఏసీలో ఒక 5 విషయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే. 
 

27

మీ రూమ్‌ సైజ్‌ ఆధారంగా: 

మీరు ఏసీని బెడ్‌ రూమ్‌లో ఏర్పాటు చేసుకుంటున్నారా.? హాల్‌లో ఏర్పాటు చేసుకుంటున్నారా.? అన్న విషయం ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే మీ గది సైజ్‌ బట్టి కూడా ఏసీని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీ గది పరిమాణం 100 స్వ్కేర్‌ వరకు ఉంటే మీ ఏసీ కెపాసిటీ 0.8 టన్స్‌ ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా వీటిని స్టడీ రూమ్‌, హామ్‌ ఆఫీస్‌, చిన్న బెడ్‌ రూమ్స్‌లో ఉపయోగిస్తారు. అలాగే 150 స్క్వేర్‌ ఫీట్‌ రూమ్‌కోసం 1 టన్‌, 250 స్క్వేర్‌ ఫీట్‌ రూమ్‌ కోసం 1.5 టన్స్, 400 స్క్వేర్‌ ఫీట్‌ రూమ్‌ కోసం 2 టన్‌ కెపాసిటీ ఉండే ఏసీని కొనుగోలు చేసుకోవచ్చు. 
 

37

కూలింగ్ కెపాసిటీ: 

ఏసీ కొనుగోలు చేసే సమయంలో చూడాల్సిన మరో అంశం కూలింగ్ కెపాసిటీ. కూలింగ్‌ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. గది కూల్‌గా మారడం అనేది దీనిపైనే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 
 

47

ISEER విలువ: 

ఏసీ కొనుగోలు విషయంలో పరిగణలోకి తీసుకోవాల్సిన మరో అంశం ISEER వ్యాల్యూ. ఇది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాల్యు ఎక్కువ ఉన్న ఏసీలు తక్కువ పవర్‌తో ఎక్కువ కూలింగ్‌ ఇస్తాయి. విద్యుత్‌ ఖర్చులు తగ్గించుకోవచ్చన్నమాట. 

57
air conditioner

ఎన్ని యూనిట్ల వినియోగం: 

ఇక మీరు కొనుగోలు చేసే ఏసీపై ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్‌ కన్జ్యూమ్‌ చేస్తుందన్న వివరాలు కూడా ఉంటాయి. ఇది తక్కువగా ఉండేలా చూసుకుంటే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. 
 

67
Air conditioner

స్టార్‌ రేటింగ్‌: 

అలాగే ఏసీ కొనుగోలు సమయంలో రేటింగ్ కూడా చూసుకోవాలి. ఏసీను ఎక్కువగా ఉపయోగించే వారు 5 స్టార్‌ తీసుకోవచ్చు. అదే అడపాదడపా ఉపయోగించే వారు 3 స్టార్‌ తీసుకున్నా పర్లేదు. 
 

77

సర్వీస్ ఉందా లేదా చూసుకోవాలి.? 

అన్నింటి కంటే ముఖ్యంగా మీరు కొనుగోలు చేసిన ఏసీ కంపెనీకి స్థానికంగా సర్వీస్‌ సెంటర్‌ ఉందా.? లేదా.? అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వెంటనే రిపేర్‌ చేసే వారు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. 

click me!

Recommended Stories