రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్
రెనాల్ట్ కైగర్ లో పూర్తి మార్పులు ఏమీ లేవు. ముందు, వెనుక బంపర్ మాత్రమే కొత్తగా కనిపిస్తున్నాయి. చక్రాలు, సైడ్ వివరాలు, హెడ్‌లైట్లు, టెయిల్ ల్యాంప్‌లు అలాగే ఉన్నాయి. రెనాల్ట్ లోగో కొత్తగా కనిపిస్తోంది. ఇంకా కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని రంగుల్లో కైగర్ మార్కెట్ లోకి రావచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.