Jio electric cycle: జియో నుంచి ఎలక్ట్రిక్‌ సైకిల్.. ఏకంగా 400 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు

Published : Feb 28, 2025, 06:52 PM ISTUpdated : Feb 28, 2025, 06:53 PM IST

టెలికం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో సంస్థ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. దుస్తులు మొదలు పెట్రోల్‌ వరకు ప్రతీ రంగంలో జియో బ్రాండ్‌ ఉంటోంది. అయితే తాజాగా జియో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Jio electric cycle: జియో నుంచి ఎలక్ట్రిక్‌ సైకిల్.. ఏకంగా 400 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు
jio electric cycle

రియలన్స్ జియో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి జియో ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారీ ప్రయాణాలకు ఈ ఇ-బైక్‌ ఉపయోగపడనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రిలయన్స్‌ ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సోషల్‌ మీడియా వేదికగా కొన్ని ఫీచర్లు, ధర వివరాలు వైరల్‌ అవుతున్నాయి. 
 

24

జియో ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను భారీ మైలేజ్‌తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సైకిల్ ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్‌తో ఏకంగా 400 కిలోమీటర్లు దూసుకెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ సైకిల్‌ విభాగంలో ఇదొక బెంచ్‌ మార్క్‌గా చెబుతున్నారు. ఇందులో లిథియం అయాన్‌ బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం. ఇక కేవలం 5 గంటల్లోనే ఈ సైకిల్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌ అవుతుందని సమాచారం. 
 

34

అంతేకాకుండా ఈ సైకిల్‌లో రిమూవబుల్ బ్యాటరీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌లో 250 వాట్స్‌ నుంచి 500 వాట్స్‌ రిమూవబుల్ బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సౌకర్యవంతమైన రైడ్‌ కోసం ఇందులో స్మూత్ యాక్సిలరేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి మోడ్స్‌ను అందించారు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉపయోగిస్తే 3 నుంచి 5 గంటల్లో, నార్మల్‌ ఛార్జింగ్‌తో 6 నుంచి 8 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ అయ్యేలా వీటిని రూపొందిస్తారని సమాచారం. 
 

44

అలాగే ఇందులో ఎల్‌ఈడీ లైట్‌, స్పీడ్‌తో పాటు బ్యాటరీ లెవల్స్‌ను చూపించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, GPS, బ్లూటూత్, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్‌తో స్మార్ట్ కనెక్టివిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ సుమారు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సైకిల్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

click me!

Recommended Stories