iQOO Z10 లైట్ 90Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మాలి G57 MC2 GPU ఉండటం వల్ల దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇది 8GB వరకు LPDDR4x RAM, 256 GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15లో పనిచేస్తుంది. ఇది 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా వేగంగా ఛార్జింగ్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. అందువల్ల ఫోటోస్, వీడియోలు బాగా కావాలనుకొనే వారు ఈ ఫోన్ తీసుకోవడం బెస్ట్.