TRAI జూన్ నివేదిక ప్రకారం Vodafone Idea (Vi), BSNL వినియోగదారులు తగ్గిపోతున్నారు. జూన్‌లో Vi 2 లక్షల కస్టమర్లను, BSNL 1.35 లక్షల కస్టమర్లను కోల్పోయింది. మే నెలలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగింది. మరోవైపు Jio, Airtel కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ, దేశంలో టాప్ టెలికాం కంపెనీలుగా తమ స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాయి.