Post Office: 5 ఏళ్లలో రూ. 36 లక్ష‌లు ఎలా పొందాలి? ఇంత‌కంటే సెక్యూరిటీ మ‌రెక్క‌డ ఉండ‌దు.

Published : Oct 08, 2025, 11:25 AM IST

Post Office: ఎంత సంపాదించామ‌న్న‌ది కాదు, ఎంత పొదుపు చేసామ‌న్న‌దాని బ‌ట్టే మ‌న ఆర్థిక ఎదుగుద‌ల ఉంటుంది. పెట్టుబ‌డి కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి బెస్ట్ ఆప్ష‌న్స్‌లో పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్ ఒక‌టి. 

PREV
17
రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్

పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎప్పటినుంచో భద్రత, నమ్మకానికి ప్రతీక. అందులో ముఖ్యమైనది రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఈ పథకం రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ ఉన్న వారికి, ఉద్యోగులకు, అలాగే భవిష్యత్‌ కోసం క్రమంగా పొదుపు చేయాలనుకునే వారికి అత్యుత్తమమైన ఎంపికగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పథకంలోని లాభాలు, వడ్డీ రేట్లు, ఇతర సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకుందాం.

27
నెలవారీ డిపాజిట్

పోస్ట్ ఆఫీస్ RDలో మీరు నెలకు కనీసం రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల మీకు వీలైనంత పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.50,000 డిపాజిట్ చేస్తే, ఐదు సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ.30 లక్షలు అవుతుంది.

37
ఆకర్షణీయమైన వడ్డీ రేటు

ప్రస్తుతం RDపై 6.7% వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ త్రైమాసికం వారీగా కాంపౌండ్ చేస్తారు. అంటే, మీరు పొందే లాభం పై లాభం చేరుతుంది. ఐదు సంవత్సరాల కాలానికి ఈ వడ్డీతో కలిపి మొత్తం సుమారు రూ.35.68 లక్షలు అవుతుంది. అంటే అదనంగా రూ.5.68 లక్షల లాభం పొందొచ్చ‌న్నమాట‌.

47
మైనర్ ఖాతాల సౌకర్యం

ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల సహాయంతో ఖాతా తెరవవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొత్త KYC వివరాలు సమర్పించి ఖాతాను కొనసాగించవచ్చు. ఇది పిల్లల భవిష్యత్‌ విద్య, వివాహ ఖర్చులకు మంచి పొదుపు మార్గంగా ఉంటుంది.

57
డిపాజిట్ చెల్లింపుల నియమాలు

ఖాతా ప్రారంభించిన నెలలో 15వ తేదీ లోపు తెరిస్తే, ప్రతి నెల 15వ తేదీలోపు వాయిదాలు చెల్లించాలి. 16వ తేదీ తర్వాత ఖాతా తెరిస్తే, ఆ నెల చివరి వ‌ర్కింగ్ డే వరకు చెల్లించవచ్చు. ఏదైనా నెలలో వాయిదా మిస్ అయితే, స్వల్ప పెనాల్టీ వర్తిస్తుంది.

67
లోన్ సదుపాయం, ముందస్తు విత్‌డ్రా

మీరు క‌నీసం ఏడాది పాటు రెగ్యుల‌ర్‌గా డిపాజిట్ చేస్తే.. మీరు డిపాజిట్ చేసిన‌ మొత్తంలో 50% వరకు రుణంగా పొందవచ్చు. ఈ రుణంపై RD వడ్డీ రేటుతో పాటు 2% అదనంగా వసూలు చేస్తారు. రుణాన్ని వాయిదాలుగా లేదా ఒకేసారి తిరిగి చెల్లించవచ్చు. అలాగే, 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అవసరమైతే ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు.

77
అదనపు ప్రయోజనాలు

నామినీ సదుపాయం: ఖాతా ప్రారంభ సమయంలోనే నామినీని యాడ్ చేయ‌వ‌చ్చు.

మొబైల్ & ఆన్‌లైన్ సౌకర్యం: ఒక్క‌సారి ఆర్డీ ఖాతాను పోస్టాఫీస్ వెళ్లి ఓపెన్ చేస్తే చాలు. నెల నెల వాయిదాలు నేరుగా మొబైల్ నుంచి చేసుకోవ‌చ్చు. పోస్టాఫీస్ మొబైల్ యాప్ అయిన ఐపీపీబీ మొబైల్ ద్వారా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు.

పన్ను ప్రయోజనం: సెక్షన్ 80C కింద పన్ను రాయితీ లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories