న‌వంబ‌ర్‌లో భారీగా బ్యాంక్ హాలీడేస్‌.. ఏయే రోజుల్లో బ్యాంక్స్ ప‌నిచేయ‌వో తెలుసా.?

Published : Oct 29, 2025, 04:39 PM IST

Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2025 నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు మొత్తం 12 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
నవంబర్ 2025 బ్యాంకు సెలవుల జాబితా

నవంబర్ నెలలో ఉన్న సెలవులు రాష్ట్రాలవారీగా ఈ విధంగా ఉన్నాయి:

* నవంబర్ 1 (శనివారం): కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అలాగే ఉత్తరాఖండ్‌లో ఇగాస్-బగ్వాల్ పండుగ కారణంగా సెలవు ఉంటుంది.

* నవంబర్ 2 (ఆదివారం): వారాంతపు సాధారణ సెలవు. దేశంలోని అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి.

* నవంబర్ 5 (బుధవారం): గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

* నవంబర్ 7 (శుక్రవారం): వాంగ్లా పండుగ సందర్భంగా మేఘాలయలోని షిల్లాంగ్ ప్రాంతంలోని బ్యాంకులకు సెలవు.

* నవంబర్ 8 (శనివారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు. అదనంగా ఇది రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు కూడా హాలీడే.

25
ఆదివారాల‌తో పాటు మ‌రికొన్ని సెల‌వులు

* నవంబర్ 9, 16, 23, 30 (ఆదివారాలు): వారాంతపు సెలవులు.

* నవంబర్ 11 (మంగళవారం): సిక్కింలో లహాబ్ దుచెన్ పండుగ కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

* నవంబర్ 22 (శనివారం): నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

* నవంబర్ 25 (మంగళవారం): గురు తేగ్ బహదూర్ జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హరియాణా, చండీగఢ్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.

35
సెలవుల్లో లావాదేవీలు ఎలా చేయాలి?

బ్యాంకులు మూసి ఉన్న రోజుల్లో కూడా మీ ఆర్థిక లావాదేవీలు ఆగవు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, యూపీఐ, ఏటీఎం సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. కాబట్టి చెల్లింపులు, బిల్లులు, మనీ ట్రాన్స్‌ఫర్లు వంటి కార్యకలాపాలను మీరు ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

45
కొత్త నిబంధన

కేంద్ర ఆర్థికశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి బ్యాంకు ఖాతాదారులు ఒకే ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఒకరినే నామినీగా పెట్టుకునే అవకాశం ఉండేది. కొత్త విధానంలో ఖాతాదారు ఎవరికి ఎంత శాతం వాటా ఇవ్వాలో ముందుగానే పేర్కొనవచ్చు. అలాగే సెఫ్టీ లాకర్‌లకు కూడా వరుస క్రమంలో నామినీలను నియమించవచ్చు. ముందుగా ఉన్న నామినీ మరణించినప్పుడు మాత్రమే తర్వాతి నామినీకి హక్కు వస్తుంది. ఈ మార్పులతో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని కేంద్రం వెల్లడించింది.

55
కస్టమర్లకు సూచన

నవంబర్ నెలలో పండుగలు, వారాంతపు సెలవులు కలిపి 12 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. కాబట్టి క్యాష్ డిపాజిట్ లేదా విత్‌డ్రా వంటి పనులను ముందుగానే పూర్తి చేయాలి. చెక్ క్లియరెన్స్ లేదా లోన్ పేమెంట్లు ఆలస్యమవకుండా ముందే ప్రాసెస్ చేయాలి. ఆన్‌లైన్ సదుపాయాలను వినియోగించి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories