Powerful passport: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఏదని అడిగితే అమెరికా అని అందరూ చెబుతారు. కానీ అది ఆ స్థానాన్ని ఎప్పుడో కోల్పోయింది. ఇప్పుడు ఏ దేశం మొదటి స్థానంలో నిలిచిందో తెలుసుకోండి. అలాగే మన దేశం ఏ స్థానంలో ఉందో కూడా తెలుసుకోండి.
హెన్రీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థను 20 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 20 ఏళ్ల నుంచి ఏ దేశ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైనదో ఇది ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకటించారు. ఇందులో అత్యంత బలమైన శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా సింగపూర్ పాస్‌పోర్ట్ నిలిచింది. 2024వ సంవత్సరంలో కూడా సింగపూర్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైందిగా మొదటి స్థానంలో ఉంది. అమెరికా పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే టాప్ టెన్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో నుండి తప్పుకుంది. ఇది 12వ స్థానానికి పడి పోయింది. 2014లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికా పాస్‌పోర్ట్ ఇప్పుడు 12వ స్థానానికి చేరడం చర్చనీయాంశంగా మారింది.
24
190 దేశాలకు వీసా లేకుండా
హెన్నీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా పౌరులు 190 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సదుపాయంతో వెళ్లగలరు. ఇక ఒకప్పుడు ప్రపంచంలోనే బలమైన పాస్‌పోర్ట్ గా ఉన్న జపాన్ మూడవ స్థానానికి పడిపోయింది.
34
మనదేశం ఎక్కడ?
ఇక మన దేశం పరిస్థితి చెప్పాలంటే 2025లో భారతదేశం 80వ స్థానం నుండి 85వ స్థానానికి పడిపోయింది. భారత పౌరులు వీసా లేకుండా లేదా వీసా ఆన్ ఎరైవల్ సదుపాయంతో కేవలం 57 దేశాలకు మాత్రమే ప్రయాణించగలరు. అందులో థాయిలాండ్, ఇండోనేషియా, భూటాన్, మారిషస్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక మన పొరుగు దేశం చైనా ప్రస్తుతం 64వ స్థానంలో ఉంది. మనతో పోలిస్తే చైనా స్థానమే బలంగా ఉంది.
ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా పేరు తెచ్చుకున్న అమెరికా పాస్‌పోర్ట్ బలం చాలా వరకు తగ్గింది. యూఎస్ పాస్‌పోర్ట్ ఇప్పుడు పదవ స్థానం నుండి 12వ స్థానానికి పడిపోయింది. బ్రెజిల్.. అమెరికా పౌరులకు వీసా రహిత ప్రయాణాన్ని ఆపివేసింది. చైనా కూడా యూఎస్ పాస్‌పోర్టును వీసా రహిత జాబితా నుండి తొలగించింది. అలాగే సోమాలియా, వియత్నం కూడా అదే పని చేశాయి. దీంతో అమెరికా పాస్‌పోర్ట్ మొదటిసారి టాప్ 10 జాబితాలో లేకుండా కిందకి దిగజారింది.