Unwanted calls: లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ కావాలా? అంటే అనేక కాల్స్ వివిధ బ్యాంకుల నుంచి వస్తూ ఉంటాయి. రోజులో అయిదారుసార్లు కాల్స్ వస్తూ ఉంటాయి. వాటితో విసిగిపోతూ ఉంటే చిన్న చిట్కాల ద్వారా వాటి నుంచి తప్పించుకోవచ్చు.
ఫోన్ మోగిందంటే లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ తీసుకోండి, లోన్ పై ప్రత్యేక ఆఫర్ ఉంది... అనే కాల్స్‌తో చిరాకు పెట్టేస్తారు. ముఖ్యంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి ఈ ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి. ఈ కాల్స్ వల్ల కేవలం ఇబ్బందే కాదు, కొన్నిసార్లు మోసాలకు కూడా గురవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. చిన్న చిన్న పనుల ద్వారా ఆ కాల్స్ రాకుండా అడ్డుకోవచ్చు. మీకు కూడా ఆ ఫోన్ కాల్స్ నుంచి మీకు విముక్తి కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
25
1909కి ఒక్క మెసేజ్
టెలికాం నియంత్రణ సంస్థ TRAI (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వినియోగదారుల రక్షణ కోసం డూ నాట్ డిస్టర్బ్ (DND) సేవను అందిస్తోంది. దీని ద్వారా మీ మొబైల్ నంబర్‌పై వచ్చే అన్ని ప్రమోషనల్ కాల్స్, SMSలను ఆపివేయవచ్చు. అందుకోసం మీరు START 0 అని టైప్ చేసి 1909 నంబర్‌కి SMS పంపాలి. దీంతో అన్ని రకాల మార్కెటింగ్ కాల్స్, సందేశాలు పూర్తిగా రావడం ఆగిపోతాయి. మీరు కేవలం బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ ప్రకటనలనే ఆపాలనుకుంటే... BLOCK 1 అని 1909కి మెసేజ్ పంపండి.
35
TRAI DND యాప్
స్మార్ట్‌ఫోన్ వాడేవారికి TRAI అధికారిక DND యాప్ కూడా అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసి, మీ మొబైల్ నంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత మీరు ఏ రకమైన ప్రమోషనల్ కాల్స్ రావాలనుకుంటున్నారో లేదా రాకూడదో ఎంపిక చేసుకోవచ్చు. unwanted calls వస్తే అదే యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు కూడా చేయవచ్చు.
మీరు ఇప్పటికే DND యాప్ ను వాడుతూ ఉన్నా కూడా ఇంకా అనవసర కాల్స్ వస్తుంటే ఆ నంబర్, తేదీ వివరాలను 1909కి SMSగా పంపండి. TRAI దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది.
55
బ్యాంకుల వెబ్ సైట్లలో కూడా
బ్యాంకుల వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌లలో Do Not Call Registry అనే విభాగం ఉంటుంది. మీరు అక్కడ మీ ఖాతాకు సంబంధించిన మార్కెటింగ్ కాల్స్ పూర్తిగా నిలిపేయమని అభ్యర్థించవచ్చు. అయితే సర్వీస్ సంబంధిత సమాచారమైన ట్రాన్సాక్షన్ అలర్ట్స్, OTPలు మొదలైనవి మాత్రం కొనసాగుతాయి.