TikTok: టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయబడిందనే సోషల్ మీడియా ప్రచారాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఎలాంటి అన్‌బ్లాకింగ్ ఆర్డర్ జారీ కాలేదని ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
TikTok:ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనపై చర్చలు, ఈ పరిణామాలు చూస్తే ఇరుదేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చైనీస్ యాప్స్ మళ్లీ భారత్ మార్కెట్లోకి వస్తాయా? ప్రధానంగా భారత్‌లో టిక్ టాక్ (TikTok)రీ ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. నిజంగా భారత్‌లో టిక్ టాక్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందా? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? అనే విషయాలు తెలుసుకుందాం.
25
సోషల్ మీడియా ప్రచారంపై కేంద్రం క్లారిటీ
చైనా వీడియో అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ (TikTok)పై నిషేధం ఎత్తివేయబడిందనే సోషల్ మీడియా ప్రచారాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. భారతదేశంలో టిక్‌టాక్‌కి అన్‌బ్లాకింగ్ ఆర్డర్ జారీ కాలేదని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అలాంటి వార్తలు తప్పుదారి పట్టించే ప్రచారం మాత్రమేనని ప్రభుత్వం తెలిపింది. అయితే, చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ AliExpress,దుస్తుల అమ్మకాల వెబ్‌సైట్ SHEIN పునరాగమనంపై మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు.
35
ఎందుకీ చర్చ
కొంతమంది టిక్‌టాక్ వినియోగదారులు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగలిగినా, లాగిన్ అవ్వడం, వీడియోలను అప్‌లోడ్ చేయడం లేదా వీక్షించడం సాధ్యం కాలేదు. అంతేకాకుండా ఈ యాప్ భారతీయ యాప్ స్టోర్‌లలో అందుబాటులో లేదు. టెలికమ్యూనికేషన్స్ శాఖ వర్గాల ప్రకారం.. ISPలు ఈ సైట్‌ను బ్లాక్ చేస్తున్నాయి. అయితే కొంతమంది యూజర్లు ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నారనే విషయంపై స్పష్టత లేదు.
జూన్ 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించింది. వీటిలో ప్రధానంగా టిక్‌టాక్, UC బ్రౌజర్, WeChat వంటి పాపులర్ యాప్‌లు ఉన్నాయి.
ఇందులో అత్యంత ప్రభావం చూపినది టిక్‌టాక్ (TikTok). కొద్ది కాలంలోనే మిలియన్ల యూజర్లను సంపాదించి, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు గట్టి పోటీగా నిలిచిన టిక్‌టాక్‌ను నిషేధించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.
55
ప్రభుత్వ స్పష్టత
ప్రభుత్వం ప్రకారం.. ఈ యాప్‌లు భారత సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత, డేటాకి భంగం కలిగే ప్రమాదం ఉందని తెలిపింది. . టెక్నికల్ నిపుణులు కూడా ఈ యాప్‌లు భారతీయ వినియోగదారుల డేటాను చైనాలోని సర్వర్‌లకు బదిలీ చేస్తున్నాయనే సాక్ష్యాలను చూపించారు. అందువల్ల.. టిక్‌టాక్ రి ఎంట్రీపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనీస్ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది.