పెట్రోల్ బంకులో మిమ్మల్ని మోసం చేశారా? అయితే ఈ నంబర్లకు కంప్లైంట్ చేయండి

Published : May 24, 2025, 12:22 PM IST

తక్కువ పెట్రోల్ కొట్టి బంకు సిబ్బంది మిమ్మల్ని మోసం చేశారా? లేదా ఉచితంగా డ్రింకింగ్ వాటర్ అడిగితే లేదని చెప్పారా? ఇలాంటప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలుసా? ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తెలుసుకుందాం రండి.

PREV
15
పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు

పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సదుపాయాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. వినియోగదారులకు అవసరమైన సేవలే బంకు నిర్వాహకులు కల్పిస్తారు. అంటే తాగునీరు, టాయిలెట్స్, వాహనాలకు గాలి పట్టడం, ఆయిల్ నాణ్యత చెక్ చేయడం మొదలైనవి ఫ్రీగానే అందిస్తారు. కాని ఇన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలియక వినియోగదారులు అనవసరంగా బయట డబ్బులు ఖర్చు చేస్తుంటారు.

25
ఈ సౌకర్యాలు తప్పనిసరి

ప్రతి పెట్రోల్ బంకులో ఒక శుభ్రమైన గది, అందులో పెద్ద మిర్రర్, కుర్చీలు ఉండాలి. ఇందులో ప్రయాణికుల విశ్రాంతి తీసుకోవచ్చు.

పెట్రోల్ బంకులో తాగునీరు, శుభ్రత గల టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి. వాటిని వినియోగించుకోవడానికి ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు. మహిళల కోసం ప్రత్యేకంగా మిర్రర్, వాషింగ్ ఫెసిలిటీ తప్పకుండా ఉండాలి.

35
అత్యవసర నంబర్లు ఉండాలి

అత్యవసర వైద్య సదుపాయం అందించేందుకు అనువుగా గది లేదా బెడ్ ఉండాలి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. వీటితో పాటు అధికారులు, హాస్పిటల్స్, పోలీసులు, మొదలైన అత్యవసరమైన ఫోన్ నంబర్లు రాసి ఒక బోర్డుపై ఉంచాలి.

ఫ్యూయల్ కూడా చెక్ చేయొచ్చు..

మీరు మీ వాహనంలో కొట్టించుకొనే ఫ్యూయల్ నాణ్యతపై మీకు సందేహం ఉన్నా మీరు డెన్సిటీ, క్వాలిటీ చెక్ చేయవచ్చు . దానిని బంక్ నిర్వాహకులు ఉచితంగా చేయాలి.

45
టైర్లలో గాలి నింపడం ఫ్రీ..

సాధారణంగా టైర్లలో గాలి నింపేందుకు బయట ప్రత్యకంగా షాపులు ఉంటాయి. అక్కడ గాలి పట్టేందుకు డబ్బు కట్టాలి. కాని ఈ సదుపాయాన్ని బంకు నిర్వాహకులు వాహనదారులకు ఉచితంగా అందించాలి. కాని చాలా బంకుల్లో గాలి నింపే మిషన్ పనిచేయడం లేదని చెబుతారు. ఒకవేళ అది పనిచేయకపోతే వెంటనే బంక్ యజమానులు రిపేర్ చేయించాలి.

55
ఈ నంబర్లకు కంప్లైంట్ చేయొచ్చు

పైన తెలిపిన సేవల్లో ఏ ఒక్కటి లేకపోయినా మీరు సంబంధిత బంకు యాజమాన్యానికి ఫిర్యాదు చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్లకు కాల్ చేసి తమ సమస్య తెలియజేయవచ్చు.

ఇండియన్ ఆయిల్: 1800 2333 555

HPCL: 1800 2333 555

భారత్ పెట్రోలియం: 1800 22 4344

రిలయన్స్: 1800 891 9023

ఇప్పటి నుంచైనా వినియోగదారులు పెట్రోల్ బంకుల్లో మీకు అందాల్సిన ఉచిత సేవలను అడిగి పొందండి. లేకపోతే ఆ బంకు యాజమాన్యానికి కంప్లైంట్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories