అయితే ఇవి కొత్త చిత్రాలు కావని, మూడేళ్ల క్రితం ఇలాగే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిసింది. ఇప్పుడు కూడా కొందరు కావాలని ఈ ఫోటోలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఇవన్నీ నకిలీ ఫోటోలు. దేశంలో కొత్త డినామినేషన్ నోట్లను విడుదల చేయలేదని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న డినామినేషన్లు రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500. ఇవి కాకుండా రూ.2, రూ.5 నోట్లు కూడా ఉన్నాయి. అయితే వాటి ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. అయినప్పటికీ మార్కెట్‌లో ఉన్నవి చట్టబద్ధంగా ఉపయోగించాలని ఆర్బీఐ తెలిపింది.