గోల్ ధన్, చునారి విధి వంటి గుజరాతీ హిందూ కుటుంబ సంప్రదాయాలను అనుసరించి, రెండు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. గోల్ ధన అంటే బెల్లం, కొత్తిమీర గింజలు. ఇది గుజరాతీ సంప్రదాయంలో వివాహానికి ముందు జరిగే వేడుక. ఈ వస్తువులు వరుడికి పంపిణీ చేస్తారు. వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి చేరుకుంది. అనంతరం అనంత్ అంబానీ, రాధిక నిశ్చితార్థం చేసుకున్నారు.