Amazon Freedom Sale 2025: అమెజాన్ బంపర్ ఆఫర్స్.. రూ. 30,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్!

Published : Aug 04, 2025, 06:09 PM IST

Amazon Great Freedom Festival Sale 2025: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 లో రూ. 30,000 లోపు టాప్ ల్యాప్‌టాప్ డీల్స్, వాటి ప్రత్యేకతలు, అసలు ధర, ఆఫర్ ధరల వివరాలు. ఈ ఫ్రీడమ్ సేల్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ల్యాప్‌టాప్ డీల్స్ ఇవి..

PREV
17
అమెజాన్ బంపర్ ఆఫర్స్

Amazon Freedom Sale 2025: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభమైంది. ప్రారంభమైంది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెజాన్ ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి అనేక ఎలక్ట్రానిక్స్‌ పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ముఖ్యంగా రూ. 30,000 లోపు ల్యాప్‌టాప్‌లపై అట్రాక్టివ్ డిల్స్ ఉన్నాయి. ఇందులో HP, Acer, Lenovo, Asus, JioBook లాంటి బెస్ట్ బ్రాండ్‌ పై భారీ డిస్కౌంట్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ల్యాప్‌టాప్ డీల్స్ ఇవి:

27
1. ఎసర్ ఆస్పీర్ లైట్ (Acer Aspire Lite)

ఎసర్ ఆస్పీర్ లైట్ ల్యాప్‌టాప్‌ 13 జెనరేషన్ Intel Core i3-1305U ప్రాసెసర్‌తో వస్తోంది. 8GB RAM, 512GB SSD ఉన్న ఈ ల్యాప్ టాప్ లో 15.6" ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లేను ఉంటుంది. మెటల్ బాడీ, 1.5 కి.గ్రాముల బెస్ట్ పోర్టబుల్‌ ల్యాప్ టాప్. ఇందులో విండోస్ 11 హోం ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ గా రావడం మరో బెస్ట్ ఫీచర్. దీని అసలు ధర రూ. 50,990 కాగా, ఆఫర్ లో కేవలం రూ. 29,990. అంటే దాదాపు 41% డిస్కౌంట్ లభిస్తుంది.

37
2. హెచ్ పీ ( HP 15 AMD Ryzen 3 7320U)

మోడల్ విద్యార్థులు, వర్క్ ఫ్రం హోమ్ కోసం సరిగ్గా సరిపోతుంది. ఇందులో Ryzen 3 7320U ప్రాసెసర్, 8GB LPDDR5 RAM, 512GB SSD, Radeon గ్రాఫిక్స్, 15.6" FHD యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉంటాయి. దీని అసలు ధర రూ. 45,995 కాగా, అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌ లో దాదాపు 36% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,490 లభిస్తోంది. 

47
ఎసర్ ఆస్పైర్ లైట్ ( Acer Aspire Lite Ryzen 3 7330U)

ఎసర్ ఆస్పైర్ లైట్ రైజెన్ 3 7330U ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 8GB RAM, 512GB SSD, 15.6" ఫుల్ HD డిస్‌ప్లే, మెటల్ బాడీ, Windows 11 Home కలిగి ఉంటుంది. ఇది డేలీ వర్క్, ఆఫీస్ వర్క్ చేసేవారి బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. దీని అసలు ధర రూ. 47,990 కాగా, అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌ లో దాదాపు 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 27,990 లకే లభిస్తోంది.

57
ఆసూస్ వివోబుక్ 15 (Asus Vivobook 15)

ఇంటెల్ Intel Pentium Gold 7505 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ వివోబుక్ 15 మోడల్ లో 8GB RAM, 512GB SSD వంటి ఫీఛర్స్ ఉన్నాయి. 15.6" FHD డిస్‌ప్లే, UHD గ్రాఫిక్స్, Windows 11 OS, 37WHR బ్యాటరీతో వస్తుంది. ఇది అసలు ధర రూ. 42,990 కాగా ఆఫర్ లో 35 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ. 27,990 పొందవచ్చు.

67
లెనొవా క్రోమ్ బుక్ ( Lenovo Chromebook)

Lenovo Chromebook చిన్న చిన్న అవసరాల బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇందులో Intel Celeron N4500 ప్రాసెసర్, 4GB RAM, 64GB eMMC స్టోరేజ్, 11.6" HD డిస్‌ప్లే, Chrome OS వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిందనే చెప్పాలి. వాస్తవానికి దీని అసలు ధర: రూ. 36,502 కాగా ఆఫర్ దాదాపు 62% డిస్కౌంట్ ఇవ్వడంతో కేవలం రూ. 13,990 లకే పొందవచ్చు.

77
జియో బుక్ 11 ( JioBook 11 Mediatek 8788)

జియో బుక్ 11 ఇది కేవలం 990 గ్రా. బరువు ఉండే అత్యంత లైట్ వైట్ ల్యాప్‌టాప్. Android బేస్‌డ్ JioOSతో వస్తున్న ఈ ల్యాప్ టాప్ లో 4GB RAM, 64GB eMMC స్టోరేజ్, SIM సపోర్ట్, Wi-Fi, 4000mAh బ్యాటరీ కలిగి ఉంది. బేసిక్ యూజ్ లేదా పిల్లలకు ఇది సూపర్ ఆప్షన్. వాస్తవానికి దీని అసలు ధర: రూ 25,000 కాగా ఆఫర్ లో రూ 12,990 లకే పొందవచ్చు. దాదాపు రూ. 12,010 ఆదా అంటే సుమారు 48% డిస్కౌంట్ పొందవచ్చు.

మనిక: ఈ ల్యాప్‌టాప్‌లన్నీ రూ. 30,000 లోపు బడ్జెట్‌ ధరలోనే లభిస్తున్నాయి. ఇవి స్టూడెంట్, ఉద్యోగి లేదా ఫస్ట్ టైం ల్యాప్‌టాప్ జాజ్ చేసేవారికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. మరో ముఖ్య విషయమేమిటంటే.. SBI కార్డ్ వినియోగిస్తే అదనంగా 10% డిస్కౌంట్, Amazon Pay, ICICI కార్డ్‌ ఉపయోగిస్తే 5% క్యాష్ బ్యాగ్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories