Business Idea: భూమి ఉంటే చాలు కాసుల వ‌ర్షం కుర‌వాల్సిందే.. ఈ సాగుతో ల‌క్ష‌ల్లో సంపాద‌న‌

Published : Jul 29, 2025, 07:14 PM ISTUpdated : Jul 29, 2025, 07:17 PM IST

వ్యాపారం చేయాల‌ని చాలా మందికి ఉంటుంది. అయితే పెట్ట‌బ‌డికి భ‌య‌ప‌డో, లాభాలు రావాన్న ఉద్దేశంతోనో వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే త‌క్కువ రిస్క్‌, పెట్టుబ‌డితో ఎక్కువ లాభాలు పొందే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. 

PREV
15
క‌ల‌బంద సాగు

కలబంద లేదా అలోవెరా ఔషధ గుణాలు కలిగిన మొక్క. దీని ఆకులలో ఉండే జెల్ సౌందర్య ఉత్పత్తులు, హెల్త్ డ్రింక్స్, ఔషధాల తయారీలో విస్తృతంగా ఉప‌యోగిస్తారు. మార్కెట్లో దీని డిమాండ్ నిరంతరం ఉండటం వల్ల రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఎడారిప్రాంతాలు, వర్షాధార భూముల్లో కూడా సులభంగా పెరుగుతుంది.

DID YOU KNOW ?
రూ.2 లక్షల ఆదాయం
తెలంగాణలో నల్గొండ జిల్లా రైతు జాజుల బుచ్చిరాములు ఒక్క ఏడాదిలో నాలుగు ఎకరాల కలబందతో రూ.2 లక్షల ఆదాయం సంపాదించారు.
25
ఎంత వ‌ర‌కు పెరుగుతుందంటే.?

కలబంద మొక్కల ఆకులు మందంగా, రసంతో ఉంటాయి, అంచుల వద్ద ముళ్లు కలిగి ఉంటాయి. ఇది 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య పసుపు-ఎరుపు రంగు కలిగిన పువ్వులు పూస్తాయి. ఆకులలోని పసుపు రంగు రసాన్ని ఎండబెట్టి మందులు తయారు చేస్తారు. 

చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, అల్సర్లు, కాలేయ రుగ్మతలు వంటి అనేక వ్యాధుల చికిత్సలో కలబంద జెల్ ఉపయోగపడుతుంది. అలాగే విరేచన నివారణ, ఋతుక్రమ నియంత్రణ, ప్లీహా సమస్యలు తగ్గించడంలోనూ ఉప‌యోగ‌ప‌డుతుంది.

35
ఇసుక నేలల్లో కూడా

కలబంద తేలికపాటి ఇసుక నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. నీరు నిల్వ ఉండని భూములు సాగుకు అనువైనవి. పిలక మొక్కల ద్వారా ప్రవర్థనం జరుపుతారు. ఒక ఎకరానికి సుమారు 8,000 నుంచి 10,000 పిలకలు నాటవచ్చు. మొక్కల మధ్య 90X45 సెం.మీ. దూరం పాటించాలి. ఎరువుల విషయంలో ఎకరానికి 8–10 టన్నుల పశువుల పేడ వేయడం అవసరం. అధిక దిగుబడికి N:P:K (20:20:20) మిశ్రమ ఎరువులు కూడా ఉపయోగించవచ్చు.

45
సాగు పద్ధతి

ఈ మొక్కకు పెద్దగా తెగుళ్లు రావు. అయితే ఆకు మచ్చ వంటి వ్యాధులు అప్పుడప్పుడు కనిపించవచ్చు. క్రమం తప్పకుండా కలుపు మొక్కలు తీయడం, మొక్కల చుట్టూ తవ్వి మట్టి ఎక్కించడం చేయాలి. వేసవి కాలంలో నీటి కొరత ఉంటే డ్రిప్ ఇరిగేషన్ వాడటం మంచిది. ఒకసారి నాటితే 4–5 సంవత్సరాలపాటు దిగుబడిని ఇస్తుంది. 10వ నెలలో మొదటి కోత, ఆ తర్వాత ప్రతి 4 నెలలకు ఒకసారి ఆకులు కోయవచ్చు.

55
దిగుబడి, ఆదాయం

మొదటి ఏడాదిలో ఒక ఎకరానికి సుమారు 25,000 కిలోల ఆకులు, రెండో ఏడాదిలో 30,000 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక్కో ఆకును లేదా మొక్కను ప్రాసెసింగ్ యూనిట్లకు అమ్మడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందుతారు. 

ఒక ఎకరంలో సుమారు 12,000 మొక్కలు నాటితే, రూ.40,000–50,000 పెట్టుబడి అవసరం. మార్కెట్ ధర ఆధారంగా ఒక్క మొక్కకు రూ.10 వరకు లభిస్తే, రూ.1.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెద్ద స్థాయిలో సాగు చేస్తే, ప్రాసెసింగ్ యూనిట్లతో బైబ్యాక్ ఒప్పందాల ద్వారా లాభాలను ఐదు రెట్లు పెంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories