కి.మీ.కి 10 పైసలు ఖర్చు చేస్తే చాలు! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్లు ఇవిగో

Published : May 01, 2025, 04:55 PM IST

Electric Scooters: మీరు తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.70,000 వరకు ఉంటే మీకు చాలా ఉపయోగకరమైన సమాచారం ఇక్కడ ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.  

PREV
15
కి.మీ.కి 10 పైసలు ఖర్చు చేస్తే చాలు! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్లు ఇవిగో

ప్రస్తుతం మన దేశంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎన్నో మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రజల్లో బాగా ఆదరణ కూడా లభిస్తోంది. ఇవి రోజువారీ పనులకు ఉపయోగంగా ఉంటున్నాయి. మీ బడ్జెట్ రూ.70,000 వరకు ఉంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని బెస్ట్, బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ స్కూటర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 

25

ఒకినావా R30

ఒకినావా R30 తక్కువ బడ్జెట్ లో లభించే మంచి స్కూటర్. దీని ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.61,998. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది గంటకు 25 కి.మీ. గరిష్ట వేగంతో వెళ్తుంది.  పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ డిజైన్ మిగతా వాటికంటే కాస్త డిఫరెంట్ గా ఉంది. అందుకే అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. 

35

కైనెటిక్ ఈ-లూనా

ఈ స్కూటర్ ధర మార్కెట్ లో రూ.69,990గా ఉంది. మంచి రైడ్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఇందులో అమర్చారు. ఇది పెద్ద 16 అంగుళాల చక్రాలను కలిగి ఉంది. వెనుక సీట్లో కూర్చునే వారికి తేలికపాటి గ్రాబ్ రెయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది చిరు వ్యాపారులకు, లోకల్ గా తిరిగి పనులు చేసుకోవడానికి మంచి ఆప్షన్. 

45

ఓలా S1X

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ S1 X పేరుతో లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర దాదాపు రూ.69,999గా ఉంది. ఇది హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది 4.3 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని గంటకు 85 కి.మీ. మాక్సిమం స్పీడ్ తో వెళ్తుంది. ఇది కూడా రోజువారీ పనులకు మంచి ఆప్షన్. 

55

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ధర ఢిల్లీలో రూ.37,078 గా ఉంది. అయితే దక్షిణ భారతదేశంలోని వివిధ సిటీల్లో సుమారు రూ.63,000 వరకు ఉంది. ఇది మార్కెట్లో లభించే అత్యంత తక్కువ, ప్రాథమిక ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇది చిన్న 250W BLDC హబ్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. అయితే గంటకు మాక్సిమం 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళుతుంది. ఇది మహిళలకు చిన్ని చిన్న పనులు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాష్‌లోని 28AH లెడ్-అసిటేట్ బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తే 50 కి.మీ. వరకు వెళ్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories