ఇంటి నుంచే ఆధార్‌లో మొబైల్ నెంబ‌ర్ మార్చుకోవ‌చ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Published : Nov 30, 2025, 09:07 AM IST

Aadhar card: సిమ్ కార్డు నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ వ‌ర‌కు ఆధార్ కార్డ్ క‌చ్చితంగా ఉండాల్సిందే. ఆధార్‌ కు లింక్ చేసే ఫోన్ నెంబ‌ర్ మార్చుకోవ‌డానికి ఆధార్ సెంట‌ర్ వెళ్లాల్సి ఉండేది. కానీ ఇక‌పై ఆధార్ ఎన్రోల్మెంట్ సెంట‌ర్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు. 

PREV
15
ఆధార్‌లో కొత్త మార్పు

ఇప్పటి వరకు ఆధార్‌లో లింక్ చేసిన మొబైల్ నంబర్ మార్చేందుకు తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లాలి. క్యూలో నిలబడాలి, ఫారం ఫిల్ చేయాలి, ఫీజు చెల్లించాలి. కానీ ఈ సమస్య త్వరలో పూర్తిగా ముగియబోతోంది. కొత్త వ్యవస్థతో ఇంట్లోనే కూర్చొని మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

25
ఇంటి నుంచే అప్‌డేట్

కొత్త విధానం ప్రకారం ఆధార్ యాప్‌లోనే మీ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌ను మార్చుకోవ‌చ్చు. ఇది రెండు ద‌శ‌ల్లో ఉంటుంది. మొదట ఓటీపీ వెరిఫికేషన్ – కొత్త నంబర్ నిజంగా మీ వద్దే ఉందని నిర్ధారిస్తుంది. తర్వాత ఫేస్ ఆథెంటికేషన్ – మొబైల్ కెమెరాతో మీ ముఖం స్కాన్ చేసి ఆధార్ డేటాలోని ఫోటోతో మ్యాచ్ చేస్తారు. ముఖం మ్యాచ్ అయిన వెంటనే కొత్త మొబైల్ నంబర్ మీ ఆధార్‌లో అప్‌డేట్ అవుతుంది.

35
ఉప‌యోగాలు

ఈ కొత్త అప్డేట్ స‌హాయంతో దూర ప్రాంతాల్లో ఉన్నవారికి, సీనియర్ సిటిజెన్స్‌కి, పిల్లల సంరక్షణలో బిజీగా ఉన్న మహిళలకు, ఆరోగ్య సమస్యలతో బయటికి వెళ్లలేని వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇక సెంటర్‌కు వెళ్లే ప్రయాణ ఖర్చు, సమయం, లైన్‌లో వేచి ఉండే ఇబ్బందులు ఉండవు.

45
ఎలా ఉప‌యోగించుకోవాలి.?

ఇది ఉపయోగించేందుకు పాటించాల్సిన స్టెప్స్:

* ముందుగా mAadhaar App డౌన్‌లోడ్ చేయాలి.

* యాప్‌లో Update Mobile Number ఆప్షన్ ఎంచుకోవాలి.

* ఆధార్ నంబర్ & కొత్త మొబైల్ నంబర్ నమోదు చేయాలి.

* వచ్చిన OTP‌ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

* Face Authentication ద్వారా గుర్తింపు నిర్ధారించాలి.

* మ్యాచ్ అయిన‌ వెంటనే నంబర్ ఆధార్‌లో అప్‌డేట్ అవుతుంది.

55
పాత విధానంలో ఎలా ఉండేది.?

పాత విధానంలో ఫోన్ నెంబ‌ర్ మార్చుకోవాలంటే.. ముందుగా సెంటర్‌కు వెళ్లాలి. అప్లికేష‌న్ ఫామ్‌ను నింపాలి. లైన్‌లో వేచి ఉండాలి. సర్వీస్ ఫీజు చెల్లించాలి. ప్రాసెస్ పూర్తి కావ‌డానికి కొన్ని రోజులు స‌మ‌యం ప‌ట్టేది. అయితే కొత్త విధానంలో కేవలం కొన్ని నిమిషాల్లోనే నెంబ‌ర్‌ అప్‌డేట్ అవుతుంది. ప్రయాణం, ఖర్చు, లైన్‌ అన్నీ అవసరం లేదు. ఫేస్ ఆథెంటికేషన్ వల్ల భద్రత మరింత పెరుగుతుంది. మోసాలు, దుర్వినియోగం అవకాశాలు తగ్గాయి.

Read more Photos on
click me!

Recommended Stories