8వ వేతన కమిషన్‌తో జరిగే లాభం ఏంటి.? ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది, ఎలా లెక్కించాలి..

Published : Jan 17, 2025, 04:33 PM IST

8వ వేతన కమిషన్ ఏర్పాటుపై ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నో ఏళ్ల కోరికను నిజం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 8వ పే కమిషన్ ను ఆమోదించింది. ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి అనే ప్రశ్నలు రావడం సర్వసాధారణం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
19
8వ వేతన కమిషన్‌తో జరిగే లాభం ఏంటి.? ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది, ఎలా లెక్కించాలి..
ఎనిమిదవ వేతన కమిషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  దీంతో దేశంలో ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది కానుక ఇచ్చింది. 

29
ఏడవ వేతన కమిషన్

ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన కమిషన్ 2016లో ఏర్పాటు కాగా. 2025 డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త పే స్కేల్ ను 2026 జనవరి నుంచి అమల్లోకి రానుంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెంచనున్నామన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ ఫిట్ మెంట్ ఆధారంగానే జీతం ఎంత పెరుగుతుందన్నది ఆధారపడి ఉంటుంది. కొద్ది రోజులకు పే కమిషన్ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఎంత ఫిట్ మెంట్ ఇవ్వనున్నారన్న క్లారిటీ రానుంది. దీని ప్రకారమే వేతనాల పెంపు ఉండనుంది. 

39
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

8వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తే దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా పెరగనున్నాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.86 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుగ సాకారమైతే ఉద్యోగుల జీతాలు ఓ రేంజ్ లో పెరగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. 

49
బేసిక్ జీతం

7వ వేతన సంఘం అమల్లోకి వచ్చే ముందు కనీస వేతనం రూ. 7వేలుగా ఉండేది. అయితే అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రూ. 18000కి పెరిగింది. ప్రస్తుతం 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే కనీస జీతం రూ. 51,840కి పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (రివైజ్డ్ రూల్స్) రూల్స్ 2025 ద్వారా ఈ మార్పులను అమలు చేయనున్నారు. ఉద్యోగులతో పాటు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈపీఎఫ్, గ్రాట్యుటీ వంటివి కూడా పెరగనున్నాయి. 

59
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయమై మాట్లాడారు. ఏడవ వేతన కమిషన్ 2016 నుండి అమలులో ఉందన్న కేంద్ర మంత్రి.  ఇది 2026 వరకు చెల్లుబాటు అవుతుంది. ఎనిమిదవ వేతన కమిషన్ 2026 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. 

69
ప్రయోజనం పొందేవారు

ఎనిమిదవ వేతన కమిషన్ అమల్లోకి వస్తే దేశ వ్యాప్తంగా సుమారు కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అదే విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్ దారులకు ప్రయోజనం జరగనుంది. 

79
గ్రాట్యుటీ సీలింగ్

8వ పే కమిషన్ అమల్లోకి వస్తే కేబినెట్ సెక్రటరీలకు గరిష్ట బేసిక్ జీతం 2.5 లక్షలకు, గ్రాట్యుటీ సీలింగ్ 20 లక్షలకు పెరిగనుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2006లో తీసుకొచ్చిన 6వ పే కమిషన్ కింద బేసిక్ శాలరీని రూ. 7000గా, గరిష్ట బేసిక్ శాలరీని రూ. 80,000గా నిర్ణయించారు. అలాగే గ్రాట్యుటీ సీలింగ్ రూ. 10 లక్షలుగా ఉంది. 

89
ఎలా లెక్కించాలి?

ఎలా లెక్కించాలి?

ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయన్నది ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా, ఉద్యోగుల జీవనప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఈ ఫిట్‌మెంట్‌ను పెంచుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కనీసం వేతనాలను ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌తో మల్టీపై చేస్తారు. అలా పెరిగిన జీతాన్ని అందిస్తారు. 

ఉదాహహరణకు ఒక ఉద్యోగి బేసిక్‌ శాలరీ రూ. 30 వేలుగా ఉంది అనుకుంటే.. ఒకవేళ 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్‌ను 2.5 శాతంగా నిర్ణయించింది అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేస్తే అప్పుడు సదరు ఉద్యోగి బేసిక్‌ శాలరీ రూ. 75,000 అవుతుంది. ఇది అమల్లోకి వచ్చే వెంటనే డీఏను అందించారు. కొన్నేళ్ల తర్వాత డీఏను జమ చేస్తారు. చేతికి వచ్చే జీతంతో పాటు ఇతర అలవెన్సుల్లోనూ మార్పులు వస్తాయి. 

99
బడ్జెట్ ముందే నిర్ణయం ఎందుకు?

ఇక మార్చిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల బలమైన కారణం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానే ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా వేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎంత ఫిట్ మెంట్ ప్రకటిస్తుంది.? జీతాలు ఎంత పెరుగుతాయన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories