Fake currency: ATMలో న‌కిలీ నోటు వ‌స్తే ఏం చేయాలో తెలుసా.?

Narender Vaitla | Updated : May 10 2025, 02:46 PM IST
Google News Follow Us

ATM: ప్రస్తుతం నకిలీ నోట్లు భారీగా పెరుగుతున్నాయి. అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం నకిలీ నోట్లను మార్కెట్లోకి పెద్ద ఎత్తున సర్క్యూలేట్ చేస్తున్నారు. ఒకవేళ మీ చేతిలోకి నకిలీ నోటు వస్తే ఏం చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

15
Fake currency: ATMలో న‌కిలీ నోటు వ‌స్తే ఏం చేయాలో తెలుసా.?

ఈ మధ్య నకిలీ నోట్ల వినిమయం పెరిగిపోతుంది. మనకు తెలియకుండానే మన చేతిలోకి నకిలీ నోట్లు వచ్చి పడుతున్నాయి. నకిలీ నోటు అని తెయికుండా ఏదైనా వస్తువు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే అది నేరంగా మారుతుంది. ఇందుకు శిక్ష కూడా అనుభవించాల్సి వ‌స్తుంది. అయితే మీకు తెలియ‌కుండా మీ చేతుల్లోకి న‌కిలీ నోటు వ‌స్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

25

మీకు నకిలీ నోటు వ‌చ్చింద‌ని తెలియ‌గానే ఏం చేయాలంటే.? 

మొదట ఆ నోటును వేరుగా ఉంచండి. దానితో కొనుగోలు చేయకండి. మీ దగ్గరకి ఎలా వచ్చింది అనేదానిపై సమాచారం గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్ లేదా సమీప RBI శాఖకు సమాచారం ఇవ్వండి. అయితే మీ నోటును బ్యాంకులో మార్చుకోవ‌డానికి వీలు ఉండ‌ద‌నే విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి. కానీ బాధ్య‌త‌గ‌ల పౌరుడిగా మీరు ఈ ప‌ని చేయాల్సి ఉంటుంది. 

35

నకిలీ నోటుతో లావాదేవీ చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది.? 

భారతీయ శిక్షాసమితి (IPC) సెక్షన్ 489C ప్రకారం, మీరు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకూ ఉండొచ్చు. కాబ‌ట్టి న‌కిలీ నోట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు. 

45
fake currency

న‌కిలీ నోట్ల‌ను ఎలా గుర్తించాలి.. 

సాధారణంగా న‌కిలీ నోట్లు వైన్స్ షాప్స్ వంటి పెద్ద పెద్ద దుకాణాల‌తో పాటు కొన్ని సంద‌ర్బాల్లో ఏటీఎమ్‌ల‌లో కూడా వ‌స్తున్నాయి. న‌కిలీ నోట్ల‌ను కొన్ని గుర్తులతో గుర్తించ‌వ‌చ్చు. నోటుపై ముద్రలు, సెక్యూరిటీ థ్రెడ్, వాటర్ మార్క్ లాంటి ఫీచర్లు చెక్ చేయండి. ఇక న‌కిలీ నోట్ల‌పై స్పెల్లింగ్ త‌ప్పుగా ఉంటున్న‌ట్లు ఆర్బీఐ ఇటీవ‌ల గుర్తించింది. 

55

ATM నుంచి నకిలీ నోటు వస్తే ఏమి చేయాలి?

ఒక‌వేళ ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసిన త‌ర్వాత వ‌చ్చిన‌ నోటు మీకు న‌కిలీ అనిపిస్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి. ఆ నోటును ఏటీఎమ్‌లో ఉన్న సీసీటీవీ ముందు చూపించాలి. అనంత‌రం ఏటీఎమ్ నుంచి తీసుకున్న రిసిప్ట్‌ను భ‌ద్రంగా దాచుకోవాలి. అక్క‌డే ఉన్న ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డుకు స‌మాచారం అందించాలి.

త‌ర్వాత స‌ద‌రు ఏటీఎమ్ బ్యాంకుకు వెళ్లి విష‌యాన్ని తెలియ‌జేసి, సాక్ష్యాల‌ను అంద‌జేయాలి. RBI నిబంధనల ప్రకారం, ATM నుంచి వచ్చిన నకిలీ నోటును మీ దగ్గర ఉన్న ఆధారాలతో చూపిస్తే, బ్యాంక్ తప్పనిసరిగా అసలైన నోటును ఇవ్వాల్సి ఉంటుంది.

Read more Photos on
Recommended Photos