AI ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీయో అందరికీ తెలుసు కదా? ప్రస్తుతం ఇది మేజర్ రంగాలన్నింటిలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. AIతో ఎంత ఉపయోగమో సరిగ్గా వినియోగించకపోతే అంత నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే AIని సరిగ్గా ఉపయోగించే స్పెషలిస్ట్ లకు కార్పొరేట్ సంస్థల్లో బాగా డిమాండ్ పెరిగింది.
AI చాట్‌బాట్‌లు ఉపయోగకరమైన సాధనంగా అనిపించినప్పటికీ, ఆరోగ్య సలహా వంటి కొన్ని ముఖ్యమైన సమాచారం కోసం వాటిపై ఆధారపడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Chat GPT, ఇతర AI చాట్‌బాట్‌లతో ఎప్పుడూ చెప్పకూడని లేదా అడగకూడని 7 విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని AI చాట్‌బాట్‌లతో ఎప్పుడూ పంచుకోవద్దు. మోసగాళ్లు మిమ్మల్ని గుర్తించడానికి, మీ కార్యాచరణను ట్రాక్ చేయడానికి ఈ సమాచారం ఉపయోగించే అవకాశం ఉంటుంది.
2. మీ బ్యాంక్ ఖాతా నంబర్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ వంటి పర్సనల్ సమాచారం AI చాట్‌బాట్‌లతో పంచుకోవద్దు. స్కామర్లు మీ డబ్బును లేదా మీ గుర్తింపును దొంగిలించడానికి ఈ సమాచారం ఉపయోగించే అవకాశం ఉంటుంది.
3. AI చాట్‌బాట్‌లలో మీ పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ పంచుకోవద్దు. మీకు మెరుగైన సేవలు అందించడం కోసం AI వివిధ వెబ్‌సైట్‌లలో మీ ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. వర్క్ సులభం అయిపోయిందని మీకు అనిపించొచ్చు కాని భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
4. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాయని, బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాయని AI చాట్‌బాట్‌లతో పొరపాటున కూడా మీ రహస్యాలను పంచుకోవద్దు. Chat GPT వంటి చాట్‌బాట్‌లు ఒక మనిషిలా మాట్లాడవచ్చు. భావోద్వేగాలు వ్యక్త పరుస్తూ కూడా మాట్లాడతాయి. కాని అవి మనుషలు కావని మీరు మర్చిపోకూడదు. మీ సమాచారం అంతా అక్కడ రికార్డ్ అవుతోందని గుర్తుంచుకోండి.
5. కృత్రిమ మేధస్సుతో తయారైన యాప్ లు, వెబ్ సైట్ లు డాక్టర్ లా మాట్లాడగలవు. దీంతో వెంటనే మీరు మీ ఆరోగ్య సమస్యలు చెప్పేయొద్దు. చాట్‌బాట్‌లను చికిత్సలు, మెడిసన్ గురించి అడగవద్దు. అంతేకాకుండా, బీమా నంబర్, మీ ఆరోగ్య సంబంధిత వివరాలను కూడా ఎప్పుడూ పంచుకోవద్దు.
6. చాలా చాట్‌బాట్‌లు వాటితో పంచుకున్న సమాచారం ఆధారంగా మీకు సమాచారాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఒకసారి ఇంటర్నెట్‌లోకి మీ సమాచారం వెళ్లిన తర్వాత ఏదీ శాశ్వతంగా తొలగించరని గుర్తుంచుకోండి. మీరు పర్మనెంట్ గా డిటీల్ చేసినా, మీ సమాచారం ఎక్కడో ఒక చోట దాగి ఉంటుంది.
7. AI చాట్‌బాట్‌లు మీరు చెప్పే విషయాలన్నీ సేవ్ చేయవచ్చు లేదా ఇతరులతో కూడా పంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికీ తెలియకూడని విషయాల గురించి పొరపాటున AI చాట్‌బాట్‌లతో అస్సలు చెప్పకండి.