మీ జీతం తక్కువా.? ఏం పర్లేదు ఈ టిప్స్‌ పాటిస్తే డబ్బు ఆదా చేయొచ్చు..

First Published | Dec 31, 2024, 6:30 AM IST

Money Saving: ఎంత సంపాదించినా డబ్బు ఆదా చేయలేకపోతున్నారా? వచ్చినంత డబ్బు ఖర్చులకే సరిపోతుందా? డబ్బు ఆదా చేయడం కష్టమనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వారిలో ఇది మరింత ఎక్కువ ఉంటుంది. అయితే సరైన చిట్కాలు పాటిస్తే డబ్బు ఆదా చేయడం పెద్ద కష్టమేమికాదు.. 

ఈ మధ్యకాలంలో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు ఆదా చేయడం కష్టంగా మారింది. సంపాదించే డబ్బులో కొంతైనా ఆదా చేయాలని అందరూ కోరుకుంటారు. కానీ సంపాదించిన డబ్బు అంతా ఖర్చులకే పోతుంది. దీంతో డబ్బు ఆదా చేయలేకపోతున్నామని చెబుతుంటారు. అయితే డబ్బు ఆదా చేసేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మీరు ఉద్యోగి అయినా, స్వంతంగా వ్యాపారం చేస్తున్నా వచ్చిన సంపాద అంతా ఖర్చులకే పోతుంటే. మీకు వచ్చే జీతానికి అనుగుణంగానే ఒక ఫార్ములాను రూపొందించుకోవాలి. ఇందుకోసం ముందుగా మీ ఖర్చులన్నింటినీ లెక్కపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గించి డబ్బు ఆదా చేయవచ్చు.


డబ్బు

ఇలా ఫార్ములాను రూపొందించుకుంటే తక్కువ జీతం వచ్చే వారు కూడా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు నెలకు రూ. 20 వేల జీతం వస్తుందని అనుకుందాం. డబ్బు ఎలా ఆదా చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

డబ్బు ఆదా

మొదట ఇంటి అద్దె, భోజనానికి ఎంత ఖర్చవుతుందో లెక్కించండి. దీంతో పాటు మీ ఇతర ఖర్చులను కూడా గమనించండి. ఇవి తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చుల జాబితాలోకి వస్తుంది. వీటిని తప్పించుకోవడం కుదరదు. కాబట్టి వీటి కోసం ఖర్చులు కేటాయించాల్సిందే. 

మీరు ప్రతీ నెలా రూ. 10 వేలు ఆదా చేయాలంటే అనవసర షాపింగ్ మానేయాలి. అవసరం లేకపోయినా చాలా మంది ఏదో ఒక కారణంతో షాపింగ్ చేస్తుంటారు. అందుకే మీకు నిజంగా ఏదో అవసరమో అదే కొనుగోలు చేయండి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయండి. 

ఇక డబ్బులు పొదుపు చేయాలంటే పాటించాల్సిన మొదటి రూల్. ఖర్చుల తర్వాత పొదుపు చేయడం కాదు. పొదుపు చేసిన తర్వాతే ఖర్చు చేయాలనే నియమాన్ని పెట్టుకోవాలి. ఇలా సేవింగ్ చేసిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లేదా SIP వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ సేవింగ్ ఆదాయంపై అదనపు ఆదాయం వస్తుంది. అయితే పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పటికే ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడుతోన్న వారి సలహాలు తీసుకోవాలి. వేటిలో పెట్టుబడి పెట్టాలో సలహాలు తీసుకోవాలి. మరెందుకు ఆలస్యం ఈ కొత్తేడాదిలో ఇలాంటి కొత్త నిర్ణయం తీసుకొని మీ జీవితాన్ని మార్చేందుకు బీజం వేయండి. 

Latest Videos

click me!