నెల‌కు రూ. 7 వేల EMI క‌డుతూ.. రూ. 40 వేలు సంపాదించొచ్చు. మీరే రాజు మీరే మంత్రి

Published : Mar 11, 2026, 09:07 AM IST

Car: మారిన సాంకేతిక విప్ల‌వంతో ఆదాయ మార్గాలు కూడా పెరిగాయి. కేవ‌లం ఉద్యోగం మాత్ర‌మే కాకుండా సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ డ‌బ్బులు సంపాదించే రోజులు వ‌చ్చాయి. నెల‌కు రూ. 7 వేల‌తో మంచి ఆదాయం పొందే ఒక అవ‌కాశం గురించి తెలుసుకుందాం. 

PREV
16
క్యాబ్ బిజినెస్

ప్ర‌స్తుతం క్యాబ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. కేవ‌లం హైద‌రాబాద్ మాత్ర‌మే కాకుండా క్ర‌మంగా టైర్ 2 న‌గ‌రాల్లో కూడా క్యాబ్‌లు అందుబాటులో వ‌స్తున్నాయి. దీంతో ఒక కారు కొనుగోలు చేసి క్యాబ్ సేవ‌ల‌ను అందిస్తూ మంచి ఆదాయం పొందొచ్చు. సాఫ్ట్‌వేర్ వంటి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా వారాంతాల్లో క్యాబ్‌లు న‌డుపుతూ అద‌న‌పు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలాంటి ఆలోచ‌న ఉన్న వారికి ఒక బ‌డ్జెట్ కారు అందుబాటులో ఉంది. ఆ కారుకు సంబంధించిన వివ‌రాలు.

26
త‌క్కువ ధ‌ర‌లో ఆల్టో కే10

త‌క్కువ బ‌డ్జెట్‌లో క్యాబ్‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే కార్ల‌లో ఆల్టో కే10. హైదరాబాద్‌లో ఆల్టో K10 ఆన్ రోడ్ ధర సుమారు రూ.4.44 లక్షల నుంచి రూ.6.55 లక్షల వరకు ఉంది. వేరియంట్ ఆధారంగా ధర మారుతుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.3,69,900గా ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.51,587, ఇన్సూరెన్స్ రూ.21,977 ఇత‌ర ఛార్జీల‌తో క‌లిపి ఈ కారు బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధ‌ర రూ. సుమారు రూ.4,43,964గా ఉంటుంది.

36
నెలకు రూ.7 వేల EMIతో కారు కొనుగోలు ఎలా?

ఈ కారును ఉదాహరణకు రూ.1,00,000 డౌన్‌పేమెంట్ పెట్టి కొనుగోలు చేశార‌నుకుంటే.. లోన్ మొత్తం రూ. సుమారు రూ.3.4 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. 5 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే. నెలకు సుమారు రూ.7,000 EMI చెల్లిస్తే సరిపోతుంది. సాధార‌ణంగా హైదార‌బాద్ లాంటి ప‌ట్ట‌ణాల్లో ఒక క్యాబ్ డ్రైవ‌ర్ అన్ని ఖ‌ర్చులు పోను రోజుకు రూ. 1000 నుంచి రూ. 1500 సంపాదిస్తున్నారు. ఈ లెక్క‌న రూ. 7 వేల ఈఎమ్ఐ చెల్లిస్తూ నెల‌కు త‌క్కువ‌లో త‌క్కువ రూ. 40,000 నుంచి రూ. 45,000 ఆదాయం పొందొచ్చ‌న్న‌మాట‌.

46
ఇంజిన్, పనితీరు ఎలా ఉంటుంది?

ఇక ఈ కారు ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఆల్టో K10 లో 998cc 1.0 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారులో పవర్: 68 bhp, టార్క్: 91 Nm, ట్రాన్స్‌మిషన్: మాన్యువల్, AMT ఆటోమేటిక్, ఫ్యూయల్: పెట్రోల్, CNG ఆప్షన్ ఉన్నాయి. ఈ కారు 0 నుంచి 60 kmph: 5.23 సెకన్లలో, 0 నుంచి 100 kmph: 12.15 సెకన్లలో చేరుకుంటుంది. లైట్ క్లచ్, స్మూత్ గేర్ షిఫ్ట్ వల్ల ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. చిన్న సైజ్ ఉండటం వల్ల సన్నని వీధుల్లో కూడా సులభంగా తిప్పుకోవచ్చు, పార్కింగ్ కూడా సులభం.

56
మైలేజ్, సౌకర్యాలు

ఆల్టో K10 ప్రధాన ఆకర్షణ మంచి మైలేజ్. ARAI మైలేజ్: 24.39 నుంచి 24.9 kmpl, సిటీ మైలేజ్: సుమారు 14.5 kmpl, హైవే మైలేజ్: సుమారు 21.8 kmpl ఇస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఈ కారులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే స‌పోర్ట్ చేస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు. కారులో 214 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇది ప్ర‌యాణికుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

66
భద్రతా ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఈ కారులో కొన్ని ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS తో EBD, ESP, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హై స్పీడ్ అలర్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద క్యాబ్ కోసం లేదా కుటుంబ అవ‌స‌రాల కోసం కారు కొనుగోలు చేయాల‌నుకునే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories