కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో చాలా ముఖ్యమైనది ఈ పథకం. ఎందుకంటే ఈ పథకం ద్వారా మీరు విద్యుత్ బిల్లుపై రాయితీ పొందడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు.పేద, మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు తమ ఇళ్లలోనే సోలార్ పవర్ ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. నేచురల్ రిసోర్సెస్ ద్వారా భారతదేశం శక్తి సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది.
దేశంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల విద్యుత్తు ప్రొడక్షన్ కూడా కష్టంగా మారింది. నదులు, నీటి వనరులు తగ్గిపోవడం కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ తయారీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం నేచురల్ రిసోర్సెస్ ని వినియోగించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన పథకమే పీఎం సూర్య ఘర్ యోజన.
దేశంలోని సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా 300 యూనిట్ల కరెంటు మీరు ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. ఓ సామాన్య, మధ్య తరగతి కుటుంబం మాక్సిమం 150 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించలేరు.
కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా మీరు విద్యుత్తును ఎక్కువగా ఆదా చేయొచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ లభిస్తుంది. అంటే 18,000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ విద్యుత్తు మీరు వాడాలనుకుంటే లోకల్ పవర్ స్టేషన్ నుండి పొందవచ్చు.
సూర్య గర్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. ఈ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 300 యూనిట్ల వరకు విద్యుత్ పొందవచ్చు.
పీఎం సూర్య ఘర్ పథకానికి అప్లై చేసుకోవడానికి అభ్యర్థికి 130 చదరపు అడుగుల టెర్రస్ ఉండాలి. దరఖాస్తుదారుడు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం ఏర్పాటు చేేసిన పథకం కాబట్టి ఇన్ కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇందులో 3 కిలోవాట్ల ప్లాంట్‌కు 1.45 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని మీరు లోన్ రూపంలో పొందవచ్చు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది.
ఒక కుటుంబం 2 కిలోవాట్ల వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఆ ఖర్చులో 60% వారి ఖాతాలో సబ్సిడీగా జమ అవుతుంది. అదేవిధంగా ఎవరైనా 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అదనపు 1 కిలోవాట్ ప్లాంట్‌పై 40% సబ్సిడీ లభిస్తుంది.
సోలార్ ఎలక్ట్రిసిటీ ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. విద్యుత్ బిల్లు ఖర్చు కూడా తగ్గుతుంది. పవర్ కట్ సమస్య ఉండదు. దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా సుమారు 1 కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్తు సౌకర్యం కల్పించారు. పొల్యూషన్ లేని ఇండియాను రూపొందించేందుకు అర్హులందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.