బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిన్ ఎంటర్ చేయక్కరలేదు: సింపుల్ గా ఆన్‌లైన్ పేమెంట్ చేయండిలా

First Published | Nov 10, 2024, 11:50 AM IST

ఏదైనా కొన్నప్పుడు స్కాన్ చేసి గాని, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తారు కదా.. పేమెంట్ చేసేటప్పుడు బ్యాంకు అకౌంట్ సెలక్ట్ చేసుకోవాలి. పిన్ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఇంత ప్రాసెస్ లేకుండా సింపుల్ గా పేమెంట్ చేసే విధానాల గురించి మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకుందాం రండి. 

ఈ కాలంలో ఏం కొనాలన్నా క్యాష్ ఎవరూ చెల్లించడం లేదు. అంతా ఆన్ లైన్ పేమెంట్లే. 10 రూపాయలు ఇచ్చి 2 రూపాయల చాక్లెట్ కొన్నామనుకోండి ఛేంజ్ ఇవ్వాల్సి వస్తుందని 2 రూపాయలు కూడా స్కాన్ చేసి పే చేయమంటున్నారు వ్యాపారులు. ఇలా ఆన్ లైన్ పేమెంట్స్ కోసం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం అంటూ రకరకాల పేమెంట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు రెండు రూపాయలు పే చేసినా, 10,000 చెల్లించినా QR కోడ్ చేయాలి లేదా వ్యాపారి ఫోన్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత కట్టాల్సిన అమౌంట్ నమోదు చేయాలి. తర్వాత మీరు లింక్ చేసి ఉంచిన బ్యాంకు అకౌంట్స్ లో ఏదో ఒక అకౌంట్ ను సెలెక్ట్ చేయాలి. పిన్ నంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ జరుగుతుంది. ఇది జనరల్ గా ఎప్పుడూ జరిగే ప్రాసెస్ కదా.?

ఇంత పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్ గా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ముఖ్యంగా తక్కువ అమౌంట్స్ పే చేసేటప్పుడు అకౌంట్ నంబర్, పిన్ నంబర్ కూడా ఎంటర్ చేయక్కరలేదు. జస్ట్.. QR కోడ్ స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి పే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా పేమెంట్ అయిపోతుంది. 

ఈ సింపుల్ ఆప్షన్ గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ లో ఉంది. అయితే వీటి గురించి చాలా మందికి తెలియవు. తెలిసినా తక్కువ మంది ఉపయోగిస్తారు. వీటిని UPI పేమెంట్, UPI లైట్ అని అంటారు. 


UPI పేమెంట్స్ చేయడానికి మీరు ముందుగా UPI ని రీఛార్జ్ చేసుకొని ఉండాలి. 500,1000 ఇలా చాలా తక్కువ అమౌంట్ తోనే UPI ని రీఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించి ఏదైనా వస్తువు కొన్నప్పుడు QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్ గా పేమెంట్ చేయొచ్చు. ఆ టైమ్ లో బ్యాంక్ అకౌంట్, పిన్ నంబర్ తో అవసరం ఉండదు. 

ఇవే కాకుండా మరికొన్ని విధానాల ద్వారా కూడా బ్యాంక్ అకౌంట్, పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేయొచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

ప్రీపెయిడ్ కార్డులు: పేటీఎం, అమెజాన్ పే వంటి ప్రీపెయిడ్ కార్డులు ముందుగానే కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి పేమెంట్స్ చేయవచ్చు. వీటిలో డబ్బు డిపాజిట్ చేసి ఆన్ లైన్ పేమెంట్స్ కోసం ఉపయోగించవచ్చు. 

యూపీఐ వర్చువల్ కార్డులు: కొన్ని యూపీఐ వాలెట్లు వర్చువల్ కార్డులను అందిస్తాయి. ఈ వర్చువల్ కార్డులను ఆన్ లైన్ షాపింగ్ లేదా చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు.

క్యాష్ కార్డులు లేదా గిఫ్ట్ కార్డులు: చాలా కంపెనీలు గిఫ్ట్ కార్డులను అందిస్తాయి. అవి ఆఫర్ చేసే వస్తువులు కొన్నప్పుడు మర్చిపోకుండా ఈ గిఫ్ట్ కార్డులను అవసరానికి తగిన విధంగా ఉపయోగించవచ్చు.

రివార్డ్ పాయింట్‌లు: కొన్ని యాప్‌లు తమ వినియోగదారులకు రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ పాయింట్‌లను ఇస్తాయి. ఇలాంటి వాటిని ఉపయోగించేటప్పుడు కూడా అకౌంట్ డీటైల్స్, పిన్ నంబర్ అవసరం లేదు. ఆన్ లైన్ పేమెంట్లకు వీటిని హ్యాపీగా ఉపయోగించవచ్చు.

Latest Videos

click me!