తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలని మీరు అనుకుంటే మీకు సరైన స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC) పథకం. ఇందులో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) అనేది ఒక చక్కటి ప్రభుత్వ పథకం. ఇది మీరు పెట్టిన పెట్టుబడికి 5 సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఈ ప్రభుత్వ పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసులలో ఎక్కడైనా మీరు ప్రారంభించవచ్చు. కనీసం రూ.1000తో ఇందులో మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ లో గొప్ప విషయం ఏంటంటే ఇందులో గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. లిమిట్ లేదు.
26
ట్యాక్స్ కూడా కట్టక్కరలేదు..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఐదేళ్ల పాటు 7.7 శాతం వార్షిక వడ్డీ పొందవచ్చు. ఈ వడ్డీని ఏటా కలుపుతారు. మెచ్యూరిటీ సమయంలో మొత్తం చెల్లిస్తారు.
అయితే కొన్ని పథకాలు ఎక్స్‌టెన్షన్ చేసినట్లుగా 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో ఈ పథకాన్ని పునరుద్ధరించలేరు. కావాలనుకుంటే మీరు కొత్త ఎన్ఎస్‌సీలో పెట్టుబడి పెట్టాలి.
36
5 సంవత్సరాలకు ఎంత లాభం
ఎన్ఎస్‌సీలో రూ.15 లక్షల పెట్టుబడిపై 5 సంవత్సరాల్లో ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.15 లక్షల పెట్టుబడిపై సంవత్సరానికి 7.7% చక్రవడ్డీ వస్తుంది. 5 సంవత్సరాలకు మెచ్యూరిటీ మొత్తం రూ.21,73,551. ఇందులో వడ్డీయే కేవలం రూ.6,73,551 ఉంటుంది.
ఎన్ఎస్‌సీలో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు రూ.1.5 లక్షల పెట్టుబడిపై మాత్రమే లభిస్తుంది. మొదటి 4 సంవత్సరాలకు ఎన్ఎస్‌సీ నుండి వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెడతారు. కాబట్టి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దానిని తిరిగి పెట్టుబడి పెట్టలేం. కాబట్టి వడ్డీ ఆదాయంపై పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు.
56
సంపాదించిన వడ్డీకి ట్యాక్స్ ఫైల్ చేయాలి
ఎన్ఎస్‌సీలో చేసిన పెట్టుబడి 5 సంవత్సరాల తర్వాత అసలు, వడ్డీతో కలిపి వస్తుంది. ట్యాక్స్ పే చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఐటీఆర్(ITR)లో ఎన్ఎస్‌సీ ద్వారా సంపాదించిన వడ్డీని ఆదాయంగా చూపించాలని గుర్తుంచుకోవాలి.
66
7.7 శాతం వడ్డీ
మీరు ఎన్ఎస్‌సీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి 7.7 శాతం వడ్డీని పొందుతున్నారని అనుకుందాం. ప్రతి సంవత్సరం రూ.7,700 ఆదాయాన్ని ITRలో చూపించడం తప్పనిసరి.