XEV 9e కి 7 సీట్ల వెర్షన్ అయిన మహీంద్రా XEV 7e ఈ సంవత్సరం చివర్లో వస్తుంది. ఇది 5 సీట్ల మోడల్ కంటే పొడవుగా ఉంటుంది. కానీ XEV 9e తోనే ప్లాట్‌ఫామ్, ఇంటీరియర్, డిజైన్, పవర్‌ట్రెయిన్ షేర్ చేసుకుంటుంది. XEV 9e కంటే 2 లక్షల నుంచి 2.50 లక్షల వరకు ఎక్కువ ధర ఉంటుంది.
మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్
2026 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ లో థార్ రాక్స్ నుంచి చాలా ఫీచర్లు, లెవల్ 2 ADAS, కొత్త క్యాబిన్ ఉంటాయి. కొత్త గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్ ఉండొచ్చు. అయితే ఇంజిన్ లో మార్పులు ఉండవు.