రూ.10 కాయిన్ తీసుకోనంటే ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తారో తెలుసా?

First Published | Nov 4, 2024, 5:35 PM IST

రూ.10 కాయిన్ మార్కెట్ లో చలామణిలో ఉందని మీకు తెలుసు కదా? అయితే వీటిపై అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. అవేంటి? ఆర్బీఐ తీసుకోనున్న చర్యలు ఏమిటి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

రూ.10 కాయిన్స్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. దీంతో వ్యాపారులు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనవసర పుకార్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు  ఆర్బీఐ ముందుకొచ్చింది. రూ.10 నాణేలను చట్టబద్ధత ఉన్నప్పటికీ గాసిప్పులు, అనుమానాల కారణంగా చాలామంది ఈ నాణేన్ని వాడటం మానుకుంటున్నారు. దీనివల్ల దుకాణాలు, ప్రజల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సుల్లోనూ వీటిని తీసుకోవడానికి కొందరు నిరాకరిస్తున్నారు.

రూ.10 నాణేలు తీసుకోవడానికి ఇటు ప్రజలు గాని, వ్యాపారులు గాని అంగీకారం తెలపకపోవడం లేదని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. బస్సులు, కిరాణా దుకాణాలు, పెట్రోలు బంకుల్లో ఇలా అన్ని దుకాణాల్లో పది రూపాయల నాణేలు వినియోగించేందుకు ఎవరూ ఒప్పుకోవడం లేదు.  కొన్ని షాపుల్లో ఇస్తే ప్రజలు కూడా తీసుకోవడం లేదు. రూ.10 నాణేలకు చట్టబద్ధత ఉందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. 

Latest Videos


RBI

రూ.10 నాణేల సైజు, బరువు గురించి అనేక గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మార్కెట్ లో పది రూపాయల నాణేలు కనిపిస్తే చాలు అందరూ భయపడుతున్నారు. వీటిని తీసుకున్నా ఉపయోగం ఉండదని తీసుకోవడం లేదు. 

దీంతో చాలా మంది వీటిని పెట్రోల్ బంకుల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని బంకుల్లో కూడా వీటిని తీసుకోవడానికి సిబ్బంది అంగీకరించడం లేదు. చివరికి ఈ కాయిన్స్ అన్నీ తిరిగి బ్యాంకులకే వచ్చి చేరుతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వానికి  అందిన ఓ నివేదిక ప్రకారం రూ.10 నాణేలు బహిష్కరణకు గురవుతున్నాయని స్పష్టంగా అర్థమైంది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఎవరైనా రూ.10 కాయిన్ తీసుకోనని చెబితే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని దుకాణాల్లో నోటీసులు కూడా అంటించారు. 1906 నాటి చట్టం ప్రకారం ఇది ఆర్బీఐ రీలీజ్ చేసిన కరెెన్సీని తిరస్కరించకూడదని హెచ్చరించింది. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

2017లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దుకాణదారులు ఈ నాణేలను తీసుకోకపోవడం వల్ల శిక్ష అనుభవించారని అధికారులు గుర్తుచేస్తున్నారు. బెంగళూరు, గోవా, హిమాచల్ ప్రదేశ్‌తో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు వెలుగుచూశాయి. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, ప్రజలు అపోహలు నమ్మవద్దని కోరుతున్నారు. ప్రజలు ధైర్యంగా రూ.10 నాణేలను తీసుకోవచ్చని చెబుతున్నారు. 

click me!