ఏటీఎంలో డబ్బు రాలేదా? కానీ డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చిందా? ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్

First Published | Nov 4, 2024, 2:19 PM IST

మీరు ATM కి వెళ్లి డబ్బు డ్రా చేసినప్పుడు డబ్బు రాలేదా? మీ అకౌంట్ లోంచి డబ్బు డెబిట్ అయినట్టు మీ మొబైల్ కి మెసేజ్ వచ్చిందా? ట్రాన్సాక్షన్ పూర్తయిందని రిసెప్ట్ కూడా వచ్చిందా? ఏం టెన్షన్ పడకండి. ఇలా చేస్తే మీ డబ్బు సేఫ్ గా మీరు పొందొచ్చు. 

సాధారణంగా ఇప్పుడు పెద్దగా ATM లతో పని ఉండటం లేదు కాని.. ఒకప్పుడు చాలా ఎక్కువగా వాటిని వాడే వారు. ఇప్పుడంతా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి నేరుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండటం లేదు. అయితే ప్రతి పనికి ఫోన్ పే, గూగుల్ పే చేయలేం కదా.. అలాంటి సందర్భంలో మనలో చాలా మంది ఏటీఎంల కోసం వెతుకుతాం. అయితే అవి సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోకుండానే వాటిని ఉపయోగిస్తాం. సరిగ్గా పనిచేయని ఏటీఎం వల్ల ఒక్కోసారి నగదు బయటకు రాకుండానే విత్ డ్రా అయినట్లు ట్రాన్సాక్షన్ అయిపోతుంది. దీంతో పాటు అకౌంట్ లోంచి డబ్బులు డెబిట్ అయ్యాయని మొబైల్ కి మెసేజ్ కూడా వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటాం. ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే ఏం చేయాలో ఇక్కడ పూర్తి డీటైల్స్ తెలుసుకుందాం. 

ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినప్పుడు డబ్బులు మీకు రాకపోతే ఈ విధంగా ముందుకు వెళ్లండి.

ముందుగా బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌లో విత్‌డ్రా అయిన అమౌంట్ వెంటనే క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా జరిగిందో లేదో చెక్ చేసుకోండి. 

అలా జరగకపోతే ఏటీఎం ద్వారా డబ్బు విత్‌డ్రా చేసిన సమయం, తేదీ, ఏటీఎం లోకేషన్, ట్రాన్సాక్షన్ ID, రిసీట్ ఉంటే దానిని జాగ్రత్త చేసి దగ్గర పెట్టుకోండి. 


ముఖ్యంగా ఏటీఎం ఐడీ, ట్రాన్సాక్షన్ నంబర్ నోట్ చేసుకొని మీరు ఏ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారో ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాల్ చేయండి. సమస్యను వివరించండి. దీంతో వారు ఏటీఎం ఐడీ, ట్రాన్సాక్షన్ నంబర్ అడుగుతారు. వీటితో పాటు కస్టమర్ కేర్ సిబ్బంది అడిగిన అన్ని వివరాలు ఇవ్వండి. దీంతో వారు మీకు ట్రాన్సాక్షన్‌ను ట్రాక్ చేసి పరిష్కారం కోసం సహాయం చేస్తారు.

లేదంటే మీరు ఉపయోగించిన ఏటీఎం ఏ బ్యాంకుకు చెందింది అయితే ఆ బ్యాంక్ లోకల్ బ్రాంచ్‌కు వెళ్లండి. సమీప బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి, సమస్యను అధికారులకు వివరించండి. మీరు తీసుకున్న రిసీట్, డీటైల్స్ తీసుకెళ్లండి. వారికి ఇవ్వండి. 

తర్వాత కంప్లైంట్ నమోదు చేయండి. బ్యాంక్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేయండి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. కంప్లైంట్ ఇచ్చిన 5 రోజుల లోపు మీ సమస్యను బ్యాంకు అధికారులు సాల్వ్ చేస్తారు. మీ డబ్బు మీ అకౌంట్ లోకి తిరిగి జమ చేస్తారు. ఒకవేళ 5 డేస్ లో మీ ప్రాబ్లమ్ ను బ్యాంకు అధికారులు పరిష్కరించకపోతే సదరు బ్యాంకే మీకు ఫైన్ కడుతుంది. 

విత్ డ్రా ప్లాబ్లం వచ్చిన 5 రోజుల్లో కచ్చితంగా బ్యాంకు మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఒక వేళ అలా చేయక పోతే 5 రోజుల తర్వాత నుంచి రోజుకు రూ.100 చొప్పుడు బ్యాంకే మీకు చెల్లిస్తుంది. అయినప్పటికీ  డబ్బులు రాకపోతే బ్యాంక్ నుండి ఫిర్యాదు పరిష్కారం కావడం లేదని RBI కి కూడా మీరు వద్ద ఫిర్యాదు చేయవచ్చు.

Latest Videos

click me!