40 పైసల వడ్డీకే రూ.3 లక్షల రుణం: మీరు అర్హులేమో చెక్ చేసుకోండి

First Published | Nov 4, 2024, 4:49 PM IST

తక్కువ వడ్డీకి రుణం తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పొందాలనుకొనే వారికి ఈ స్కీమ్ అద్భుతమైన అవకాశం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా మీరు కేవలం 40 పైసలకే రూ.3 లక్షల రుణం పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి. 
 

దేశంలో అందరికీ ఉద్యోగాలు రావాలంటే కష్టం. ప్రభుత్వాలు కూడా అందరికీ జాబ్స్ ఇవ్వలేవు. అందుకే నేటి యువతను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్ లు అమలు చేస్తోంది. అలాంటి వాటిలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (PM Vishwakarma Yojana) ఒక బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు.
 

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని 2023లో ప్రారంభించారు. మన దేశంలోని శిల్పకారులు, చేతి పనిదారుల అభ్యున్నతికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే దీనికి వస్తున్న ఆదరణను చూసి ఆసక్తి ఉన్న ఎవరికైనా 18 రకాల పనులను నేర్పించి స్వయం ఉపాధి కల్పించేందుకు సహాయం చేస్తారు. ఈ స్కీమ్ ద్వారా పేద కళాకారులకు ఆర్థిక, మార్కెటింగ్ సహాయం కూడా అందిస్తారు.
 


ఇందులో కార్పెంటింగ్ వర్క్, గోల్డ్ స్మిత్, శిల్పకళ, చెప్పుల తయారీ, కన్‌స్ట్రక్షన్ తదితర రంగాల్లో పనిచేసే వారికి ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా లబ్ధి పొందాలనుకున్న వారు ముందుగా ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి వంశపారంపర్యంగా పనులు చేస్తున్న వారు అర్హులు. ఈ స్కీమ్ లో చేరాలంటే మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాంటి వారు అప్లై చేసుకుంటే అధికారులు ఎక్వైరీ చేసి అర్హులైతే వారికి ముందుగా PM Vishwakarma సర్టిఫికేట్, ID కార్డ్ ఇస్తారు. 
 

ఈ విధంగా ఎంపికైన వారికి నైపుణ్యాభివృద్ధి కోసం 5 నుంచి 7 రోజుల వరకు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. తర్వాత 15 రోజుల స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ సమయంలో వారి ఉపాధి పోకుండా ఉండాలని వారికి ప్రోత్సాహకంగా రోజుకు రూ.500 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 

ట్రైనింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వారికి టూల్‌కిట్ ప్రోత్సాహకంగా అందిస్తారు. దీని విలువ రూ.15,000  ఉంటుంది.  దీన్ని ఉపయోగించి వారు బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 
 

ఇలా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల వరకు రుణాన్ని ఇస్తుంది. దీన్ని రెండు విడతల్లో అంటే రూ.1 లక్ష, రూ.2 లక్షలుగా వివిధ దశల్లో ఇస్తుంది. ఈ రుణం పొందినందుకు గాను అభ్యర్థులు కట్టాల్సిన వడ్డీ కేవలం రూ.40 పైసలు మాత్రమే. దీంతో పాటు ప్రతి డిజిటల్ లావాదేవీపై రూ.1 వరకు ప్రయోజనం పొందవచ్చు. శిల్పకారుల ఉత్పత్తులకు బ్రాండింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్, గెం వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో చేరే అవకాశం కూడా కల్పిస్తారు. 

మరిన్ని వివరాలు, నమోదు కోసం PM Vishwakarma యోజన వెబ్ సైట్ ను ఒకసారి చూడండి. 
 

Latest Videos

click me!