Yamaha R2 : R15 కి బాప్ లాంటి బైక్ వచ్చేసింది.. KTM కి గట్టి కాంపిటీషన్.. యామహా R2 గ్రాండ్ ఎంట్రీ !

Published : Aug 27, 2026, 06:37 PM IST

Yamaha YZF R2 : భారత టూ-వీలర్ మార్కెట్‌లో యామహా మోటార్ సంస్థ యంగ్ రైడర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న యామహా R2 (Yamaha YZF-R2) భారతదేశంలో లాంచ్ చేసింది. రూ. 2.30 లక్షల ప్రారంభ ధరతో విడుదలై, KTM RC 200, కరిజ్మా XMR 210 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇస్తోంది.

PREV
15
యంగ్ రైడర్స్ కోసం యామహా మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్

ఇండియన్ టూవీలర్ మార్కెట్‌లో యంగ్ రైడర్స్, కాలేజ్ స్టూడెంట్స్‌కు మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ యామహా. ముఖ్యంగా YZF-R15 బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ క్రేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ, యామహా మోటార్ ఇండియా భారతదేశంలో సరికొత్త YZF-R2 సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఆగస్టు 12న రూ. 10,000 టోకెన్ అమౌంట్‌తో ప్రి-బుకింగ్స్ ప్రారంభం కాగా, ఈ బైక్ R15 కంటే పవర్ ఫుల్ వర్షన్‌గా మార్కెట్లోకి వచ్చింది.

25
సరికొత్త 204cc ఇంజిన్, కిల్లర్ పర్ఫార్మెన్స్

యామహా R2 బైక్‌లో పూర్తి కొత్త వేరియంట్ 204cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, DOHC ఇంజిన్‌ను అమర్చారు. ఇది 10,000 rpm వద్ద 26.5 PS (26.1 bhp) పవర్, అలాగే 8,000 rpm వద్ద 19.1 Nm టాక్ ప్రొడ్యూస్ చేస్తుంది. R15 లో ఉండే SOHC ఇంజిన్ కాకుండా, ఇందులో డ్యూయల్ ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్ సెటప్ ఉపయోగించారు.

ఫ్లాగ్‌షిప్ YZF-R1 బైక్ మోడల్‌లో వాడే Diamond-Like Carbon కోటింగ్‌ను ఈ R2 ఇంజిన్ వాల్వ్స్‌కు కూడా అందించడం విశేషం. దీనివల్ల ఫ్రిక్షన్ తగ్గి, బైక్ చాలా స్మూత్‌గా, స్పీడ్‌గా వెళ్తుంది.

35
సెగ్మెంట్‌లోనే మోస్ట్ లైట్‌వెయిట్ రేసింగ్ మెషిన్

ఈ బైక్ కోసం యామహా స్పెషల్‌గా రూపొందించిన ఆల్-న్యూ డైమండ్ స్టీల్ ఫ్రేమ్‌ను వాడింది. ఈ ఫ్రేమ్ బరువు కేవలం 14 కేజీలు మాత్రమే. కేటీఎం ఆర్‌సి 200 , హీరో కరిజ్మా XMR వంటి రేసింగ్ బైక్స్‌తో పోలిస్తే, కేవలం 149 కేజీల కర్బ్ వెయిట్‌తో సెగ్మెంట్‌లోనే అత్యంత తక్కువ బరువున్న బైక్‌గా యామహా R2 రికార్డ్ క్రియేట్ చేసింది.

45
మైండ్ బ్లాక్ చేసే టెక్ అండ్ ఫీచర్లు

యామహా ఈ కొత్త బైక్‌ను యంగ్ జనరేషన్‌కు తగ్గట్టుగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో నింపేసింది.

• యామహా రైడ్ కంట్రోల్ (YRC): స్ట్రీట్, స్పోర్ట్, రైన్ అని 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

• డిస్‌ప్లే అండ్ రైడింగ్ అసిస్ట్: 5-ఇంచ్ ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్.

• మిడ్ అండ్ టాప్ మోడల్స్: సెగ్మెంట్ ఫస్ట్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, బాడీ కలర్ అల్లాయ్ వీల్స్.

• R2 M ప్యాక్: ప్రిలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, అడ్జస్టబుల్ లీవర్లు, నకిలీ సుయేడ్ సీట్, సిల్వర్ స్వింగ్‌ఆర్మ్, స్మార్ట్ కీ సిస్టమ్.

55
ధర ఎంత? డెలివరీలు ఎప్పటినుంచి?

యామహా R2 మోడల్ 3 వేరియంట్లు, 5 అట్రాక్టివ్ కలర్స్ అయిన మెటాలిక్ బ్లాక్, డార్క్ బ్లూయిష్ గ్రే, మ్యాట్ వైట్ పెర్ల్, రేసింగ్ బ్లూ, మెటాలిక్ గ్రే లలో అందుబాటులో ఉంటుంది.

• Base Variant: రూ. 2.30 లక్షలు (ఎక్స్ షోరూం ధరలు)

• Quick Shifter Variant: రూ. 2.39 లక్షలు

• YZF-R2 M (Top Variant): రూ. 2.53 లక్షలు

ఈ సరికొత్త యమహా R2 బైక్స్ కేవలం యమహా బ్లూ స్క్వేర్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే సేల్ కానున్నాయి. బైక్ డెలివరీలు సెప్టెంబర్ 2026 మిడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. R15, MT-15, XSR 155 లైనప్‌తో పాటు ఈ ఆర్‌2 కూడా ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది.

Read more Photos on
click me!

Recommended Stories