Ultraviolette Tesseract: ఇది మాములు స్కూటర్‌ కాదు బాబోయ్‌.. కారును మించిన ఫీచర్లు, 260 కి.మీల మైలేజ్‌తో పాటు

Published : Mar 05, 2025, 07:28 PM IST

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు సబ్సిడీలు అందించడం, పెరిగిన ఇంధన ధరల నుంచి ఉపశమనం లభిస్తుండడంతో చాలా మంది ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ అల్ట్రావయలెట్‌ కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది..   

PREV
14
Ultraviolette Tesseract: ఇది మాములు స్కూటర్‌ కాదు బాబోయ్‌.. కారును మించిన ఫీచర్లు, 260 కి.మీల మైలేజ్‌తో పాటు

మార్కెట్లోకి రోజుకో ఎలక్ట్రిక్‌ వెహికల్ సందడి చేస్తోంది. ఓవైపు దిగ్గజ సంస్థలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలను లాంచ్‌ చేస్తుంటే మరోవైపు స్టార్టప్‌ కంపెనీలు సైతం విద్యుత్‌ వాహనాలను లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ లాంచ్‌ అయ్యింది. ఎలక్ట్రిక్‌ సైకిళ్లను తయారు చేస్తున్న ప్రముఖ స్టార్టప్‌ సంస్థ అల్ట్రావయలెట్‌ భారత్‌లో తొలిసారిగా ఈవీ స్కూటర్‌ను తీసుకొచ్చింది. 
 

24

టెసెరాక్ట్‌ పేరుతో ఈ స్కూటీని తీసుకొచ్చారు. యుద్ధ విమానాల స్ఫూర్తితో ఈ స్కూటీని లాంచ్‌ చేసినట్లు సంస్థ తెలిపింది. ఆకట్టుకునే డిజైన్‌, అదిరిపోయే ఫీచర్లతో ఈ స్కూటర్‌ను లాంచ్‌ చేశారు. షార్ప్‌ కట్‌తో కూడిన ముందు భాగం, ఫ్లోటింగ్‌ డీఆర్‌ఎల్స్‌, డ్యూయల్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ స్కూటర్‌ క్లాసీ లుక్‌ను అందించాయని చెప్పాలి. ఇక ఈ స్కూటీని డిసెర్ట్‌, స్టెల్త్‌ బ్లాక్‌, సోనిక్‌ పింక్‌ వంటి కలర్స్‌లో తీసుకొచ్చింది. 
 

34

ధర విషయానికొస్తే ఈ స్కూటీ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 1.20 లక్షలుగా ఉంది. అయితే ఇది కేవలం తొలి 10 వేల మందికి మాత్రమే అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటీని త్వరలోనే యూరోపియన్‌ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్‌లో 7 ఇంచెస్‌తో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. సీటు కింద 34 లీటర్ల స్టోరేజీని అందించారు. 
 

44
Ultraviolette-Tesseract

భారతదేశంలో తొలిసారి రియర్‌ రాడార్‌ టెక్‌ను అందించారు. అలాగే ఇందులో సేఫ్టీ కోసం ఫ్రంట్‌, రియర్‌ రాడార్‌ టెక్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, కొలిజన్‌ అవాయిడెన్స్‌, ఓవర్‌టేక్‌ అలర్ట్స్‌, లేన్‌ ఛేంజ్‌ అసిస్ట్‌, రియర్‌ కొలిజన్‌ అలర్ట్‌, ఇంటిగ్రేటెడ్‌ డాష్‌క్యామ్‌, హ్యాండిల్‌ బార్‌ వద్ద హాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 6KWH కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. 

ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 261 కిలోమీటర్లు దూసుకెళ్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ స్కూటీలో అందించిన ఎలక్ట్రిక్‌ మోటార్‌ 20 హెచ్‌పీ పవర్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఇక ఈ స్కూటీ కేవలం 2.9 సెకండ్లలో 0 నుంచి 80 కీలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటీ గంటకు 125 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. కంపెనీ బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల వారెంటీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

click me!

Recommended Stories