Honda QC1: 80 కిలోమీటర్ల మైలేజ్‌తో హోండా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర కూడా తక్కువే

Published : Feb 27, 2025, 12:59 PM IST

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ప్రముఖ టూ వీలర్‌ కంపెనీలన్నీ విద్యుత్ ఆధారిత వెహికిల్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ టూ వీలర్‌ సంస్థ హోండా మార్కెట్లోకి క్యూసీ1 పేరుతో కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది.. 

PREV
15
Honda QC1: 80 కిలోమీటర్ల మైలేజ్‌తో హోండా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర కూడా తక్కువే
తక్కువ ధరలో ఎక్కువ దూరం వెళ్లే EV స్కూటర్ - హోండా QC1

ప్రముఖ టూ వీలర్‌ తయారీ సంస్థ హోండా మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటీ లాంచ్‌ చేసింది. స్టైలిష్‌ లుక్‌, పవర్‌ ఫుల్ ఇంజన్‌తో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ స్కూటీని లాంచ్‌ చేశారు. హోండా క్యూసీ1 స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

25
హోండా స్కూటర్

హోండా QC1 ధర

ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ధర విషయానికొస్తే రూ. 90,000 ఎక్స్ షోరూమ్ ప్రైజ్ గా ఉంది. అయితే ఆన్ రోడ్ ధర విషయానికొస్తే రూ. లక్షలోపు లభిస్తాయి. ఇది మీ ప్రాంతాన్ని బట్టి మారుతుంది. మొత్తం మీద తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్కూటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. 

35
బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

హోండా QC1 ఫీచర్లు..

ఫీచర్ల విషయానికొస్తే హోండా క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.15 kWh బ్యాటరీని అందించారు. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ స్కటీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 80 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా దూసుకుపోతుంది. 

45

హోండా QC1 మరిన్ని ఫీచర్లు

హోండా QC1 మంచి బ్యాటరీ రేంజ్‌తో పాటు చాలా గొప్ప ఫీచర్లను అందించారు: 

* ఈ స్కూటీలో అలాయ్ వీల్స్ ను అందించారు. 

* 26 లీటర్ల బూట్ స్పేస్ - ఎక్కువ స్థలం లభిస్తుంది. 

* డిజిటల్ కన్సోల్ - స్పీడ్, బ్యాటరీ లెవల్స్ చూపిస్తుంది.

* డ్రమ్ బ్రేక్ - సేఫ్టీ బ్రేకింగ్ సిస్టమ్.

* USB ఛార్జింగ్ పోర్ట్ - మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.

* LED లైట్లు - రాత్రుళ్లు క్లియర్ విజన్ అందిస్తుంది. 

55
హోండా QC1

తక్కువ ధరలో మంచి బ్రాండ్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఒలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. లక్షకి పైగా అందుబాటులో ఉన్న తరుణంలో హోండా వంటి కంపెనీ నుంచి ఈ ధరకు స్కూటీ లభించడం విశేషంగానే చెప్పొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories