బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్125:
బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 125లో సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ .1,06,739గా ఉంది. ఈ బైక్‌లో శక్తివంతమైన 124.45 సీసీ ఇంజిన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అప్ డేటెడ్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లను అందించారు. హాలోజెన్ టర్న్ ఇండికేటర్ల స్థానంలో ఎల్ఇడి ఇండికేటర్లను అందించారు. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్‌లో స్పీడోమీటర్, రియల్ టైమ్ ఫ్యూయల్ వినియోగం, ఏ గేర్‌లో ఉన్నారో చెప్పే ఇండికేటర్ వంటి ఫీచర్లను అందించారు.
ఇక ఇందులో బజాజ్ రైడ్ కనెక్ట్ అప్లికేషన్ ద్వారా ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీని ఆప్షన్‌ను ఇచ్చారు. అలాగే మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్టును కూడా ఇచ్చారు. ఇంజన్ విషయానికొస్తే.. 124.45 సిసి, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఇచ్చారు. ఇది 8,500 ఆర్ పిఎమ్ వద్ద 12 బిహెచ్ పి గరిష్ట శక్తిని, 7,000 ఆర్ పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్స్ ఉంటాయి.