Best Mileage bikes: రూ. 70 వేల ధరలో 70కిపైగా మైలేజ్‌.. బెస్ట్‌ బైక్స్‌పై ఓ లుక్కేయండి

Published : Feb 26, 2025, 10:14 AM ISTUpdated : Feb 26, 2025, 10:21 AM IST

కొత్త బైక్ కొనుగోలు చేసే ముందు మనలో చాలా మంది ఆలోచించే అంశం మైలేజ్. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం చూస్తుంటారు. మీరు కూడా ఇలాంటి బైక్ కోసమే చూస్తున్నారా.? మరి రూ. 70 వేల నుంచి,  రూ. 80 వేల బడ్జెట్ లో అందుబాటులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొన్ని బైక్స్ పై ఓ లుక్కేయండి.. 

PREV
15
Best Mileage bikes: రూ. 70 వేల ధరలో 70కిపైగా మైలేజ్‌.. బెస్ట్‌ బైక్స్‌పై ఓ లుక్కేయండి
70 నుంచి 80 వేల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఇవే..

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కు భారత మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు వీటికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో రూ. 80 వేల లోపు బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే కొన్ని బైక్స్ సందడి చేస్తున్నాయి. అవేంటంటే.. 
 

25
హీరో స్ప్లెండర్ ప్లస్

ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ బైక్ ధర రూ. 77,176 నుంచి రూ. 79,926 మధ్య అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్ లో 97.2cc ఇంజిన్ ను అందించారు. ఇక మైలేజ్ పరంగా చూస్తే ఈ బైక్ ఏకంగా లీటర్ పెట్రోల్ కు 70 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. 
 

35
టీవీఎస్ స్పోర్ట్

తక్కువ బడ్జెట్లో మంచి ఆప్షన్స్ కోసం చూసే వారికి టీవీఎస్ స్పోర్ట్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 59,881 నుంచి రూ. 71,785 వరకు ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 109.7సిసి ఇంజిన్ ను అందించారు. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు ఏకంగా 70 కి.మీల మైలేజ్ అందిస్తుంది. 
 

45
హోండా షైన్ 100

ఎక్కువ మైలేజ్ ఇచ్చే హోండా కంపెనీకి చెందిన బైక్స్ లో హోండా షైన్ 100 ఒకటి. ఈ బైక్ ధర రూ. 66,900 ఎక్స్ షోరూమ్ ధరగా ఉంటుంది. ఇక ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు రూ. 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 
 

55
బజాజ్ ప్లాటినా 110

తక్కువ ధరలో అందుబాటులో, మంచి ఫీచర్లతో కూడిన బైక్స్ లో ఇదీ ఒకటి. బజాజ్ ప్లాటినా 110 సీసీ ఇంజన్ ను అందించారు. కంఫర్టబుల్ సీటింగ్ తో లాంగ్ డ్రైవింగ్ చేసే వారికి కూడా బాగుంటుంది. ధర విషయానికొస్తే ఈ బైక్ రూ. 71,354కి లభిస్తోంది. ఈ బైక్ 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 

 

click me!

Recommended Stories