Jio : జియో టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం రాబోతోంది... అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లతో

Published : Feb 18, 2025, 05:21 PM ISTUpdated : Feb 19, 2025, 06:38 PM IST

Jio Things : భారతీయ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవి జియోతో జతకట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించనున్నాయి. ఈ టూవీలర్స్ లో ఎలాంటి టెక్నాలజీ ఉంటుందంటే... 

PREV
13
Jio : జియో టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం రాబోతోంది... అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లతో
Jio Things, PURE EV

Jio Things, PURE EV : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు జోరు కొనసాగుతోంది. మార్కెట్ లోకి కొత్త కొత్త టెక్నాలజీలతో అనేక కంపనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తెస్తున్నాయి. అయితే వినియోగదారులకు స్మార్ట్ రైడింగ్ అనుభూతిని అందించేలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారుచేయడంలో ప్యూర్ ఈవీ ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఈసారి మాత్రం స్మార్ట్ టెక్నాలజీతో అందరినీ ఆశ్చర్యపరిచేలా వెహికిల్ తీసుకువచ్చేందుకు PURE EV సిద్దమయ్యింది.  

ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీలో ప్యూర్ ఈవికి విశేషమైన అనుభవం ఉంది. ఇలాగే టెక్నాలజీ రంగంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది. ఈ రెండు కలిస్తే... అద్భుతమైన స్కూటర్ ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది... జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుంబంధ సంస్థ జియో థింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది ప్యూర్ ఈవీ. ఈ కలయిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. 

వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్యూర్ ఈవీ సంస్థ జియో థింగ్స్ తో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో జియో థింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్‌ను ప్యూర్ ఈవి తమ వాహనాల్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే అధునాతన ఐవోటి సొల్యూషన్స్ తో పాటు ఆటంకం లేకుండా కనెక్టివిటీని అందిస్తూ వియోగదారులకు సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని కల్పించవచ్చు. 

23
Jio Things, PURE EV

జియోథింగ్స్ తో ఒప్పందంతో ప్యూర్ ఈవీ ఎలా మారనుంది... 

ప్యూర్ ఈవీ సంస్థ తమ ఎలక్ట్రిక్ టూవీలర్స్ పనితీరు, ఇంటరాక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వాహనాల్లో ఐవోటీ సొల్యూషన్స్‌తో పాటు జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను అనుసంధానించడంపై దృష్టి పెడుతోంది. 4జీ కనెక్టివిటీ ఆధారిత టెలీమ్యాటిక్స్ అనేది కస్టమర్లు రియల్ టైమ్‌లో వాహన పనితీరును పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మరింత మెరుగైన వాహన పనితీరు సాధించేందుకు ఉపయోగపడే వివరాలను పొందేందుకు ఇది తోడ్పడుతుంది. 

జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏవోఎస్‌పీ) ఆధారిత AvniOSను ఉపయోగించుకుంటుంది. ఇది రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, ద్విచక్ర వాహన ఇంటర్‌ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్‌డీ+ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కంపాటిబిలిటీని అందిస్తుంది. ఓఈఎంలు తమ ఉత్పత్తుల్లో ఐవోటీ సొల్యూషన్స్‌ను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ విప్లవాత్మకమైన డిజిటల్ క్లస్టర్ ఉపయోగపడుతుంది. 

జియో ఆటోమోటివ్ యాప్ సూట్ (JAAS) అనేది వాహనాల్లో అనుసంధానించబడిన మరొక సొల్యూషన్. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల యూజర్ల కోసం రూపొందించిన జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నేవిగేషన్, గేమింగ్ లాంటి ఎన్నో ప్రోడక్టులు, సొల్యూషన్స్ ఇందులో ఉంటాయి.

33
Jio Things, PURE EV

ప్యూర్ ఈవి, జియో థింగ్స్ కలయికతో బెనిఫిట్స్ ఇవే..

“మా వాహనాల్లో జియోథింగ్స్ యొక్క అత్యుత్తమ ఐవోటీ సామర్థ్యాలను పొందుపర్చడం వల్ల ప్యూర్ ఈవీ ఉత్పత్తులను ఈ పరిశ్రమలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఉండేలా తీర్చిదిద్దేందుకు ఒక చక్కని అవకాశం లభిస్తుంది. మా వాహనాల సామర్థ్యాలు, ఇంటరాక్టివిటీని మెరుగుపర్చడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీకి నిర్వచనంగా మారాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మెరుగైన కనెక్టివిటీ, పనితీరు, సౌలభ్యం ద్వారా కస్టమర్లకు ప్రయోజనం పొందేలా ఈవీ వ్యవస్థను పునర్నిర్వచించే అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగు కాగలదు” అని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డా.నిశాంత్ దొంగారి తెలిపారు. 

“ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో కొత్త ఆవిష్కరణలు, శ్రేష్టత సాధించాలనే ఉమ్మడి లక్ష్యం గల ప్యూర్ ఈవీతో జట్టు కట్టడం సంతోషకరమైన విషయం. మా అధునాతన ఐవోటీ సొల్యూషన్స్‌ను అనుసంధానించడం ద్వారా తమ కస్టమర్లకు అత్యుత్తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అనుభూతిని అందించడంలో, పనితీరు, కనెక్టివిటీపరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో ప్యూర్ ఈవీకి తోడ్పాటు అందించాలనేది మా లక్ష్యం. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ అనుకూల రవాణా సొల్యూషన్స్‌ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించే దిశగా ఈ భాగస్వామ్యం ఒక ముందడుగు కాగలదు” అని జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశీష్ లోధా తెలిపారు. 

click me!

Recommended Stories