జాజ్ ఫ్రీడమ్ 125 బైక్‌లో డిజిటల్ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ లైట్స్‌తో పాటు కంఫర్టబుల్‌గా ఉండే సీటింగ్‌ను అందించారు. దీంతో ఎక్కువ దూరమైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఈ బైక్ 9.4 పీఎస్ పవర్, 9.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిపి, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 కిలోల సీఎన్జీ ట్యాంక్ ఉన్నాయి. సీఎన్‌జీ, పెట్రోల్ కలిపి ఈ బైక్ మొత్తం 300 కిలోమీటర్లు వెళ్లగలదు.