Simple One: 180 కి.మీలు మైలేజ్‌, 7 ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌ బోర్డ్‌.. ఆకట్టుకుంటోన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Published : Mar 15, 2025, 02:46 PM IST

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. మఖ్యంగా ఎక్కవ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
14
Simple One: 180 కి.మీలు మైలేజ్‌, 7 ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌ బోర్డ్‌.. ఆకట్టుకుంటోన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ అయిన సింపుల్ ఎనర్జీ, సింపుల్ వన్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1,39,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కొత్త మోడల్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కిమీ వరకు వెళ్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ కంపెనీ రెండు వేరియంట్స్‌లో స్కూటర్‌ను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి సింపుల్ వన్ఎస్ కాగా మరొకటి సింపుల్ వన్ జనరల్ 1.5.

24
సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్‌ వన్‌ ఎస్‌ స్కూటర్‌  3.7kWh బ్యాటరీ నుంచి 8.5kW మోటార్ డ్రాయింగ్ పవర్‌ను ఉపయోగిస్తుంది. నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - ఈకో, రైడ్, డాష్, సోనిక్. ఎలక్ట్రిక్ స్కూటర్ సోనిక్ మోడ్‌లో 2.55 సెకన్లలో 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఇక ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 

34

ఈ స్కూటర్‌ను బ్రేసెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ, రెడ్ వంటి కలర్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ స్కూటీ సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్‌ కెపాసిటీని అందించారు. సీటు హైట్‌ 770 మిమీగా ఉంది. 

సింపుల్ వన్ఎస్‌లో 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్‌ను ఇచ్చారు. ఇది అప్లికేషన్ ఇంటిగ్రేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. ఫైండ్ మై వెహికల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫాస్ట్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఈ స్కూటీ సొంతం. ఇక పార్కింగ్‌ సెన్సర్‌లను కూడా ఇందులో అందించడం విశేషం. అలాగే ఈ స్కూటీ 5G ఇ-సిమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే ఈ స్కూటీ బ్లూటూత్‌ కనెక్టివిటీకి సపోర్ట్‌ చేస్తుంది. 

44
దూర ప్రయాణానికి అనుకూలమైన స్కూటర్

సింపుల్ వన్ఎస్ బెంగళూరు, పూణే, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, కొచ్చి,  మంగళూరులోని  సింపుల్ ఎనర్జీ షోరూమ్‌లలో లభిస్తోంది. 

సింపుల్ ఎనర్జీ తన సేవలను దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 150 కొత్త షోరూమ్స్‌, 200 సర్వీస్‌ సెంటర్లతో విస్తరించాలని యోచిస్తోంది. ఈ సంస్థ తమిళనాడులోని హోసూర్‌లో సంవత్సరానికి 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తయారీ యూనిట్‌ను నడిపిస్తోంది. 

click me!

Recommended Stories