సేల్స్ తగ్గిన నేపథ్యంలోనే:
ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకెళ్లిన ఓలా ఇటీవలి కాలంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. గత నెలలో ఓలా మొత్తం 8,647 యూనిట్లను విక్రయించింది. అయితే బజాజ్, టీవీఎస్, ఏథర్ వంటివి భారీగా అమ్మకాలను చేపట్టాయి. దీంతో ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ఓలా కంపెనీ తీవ్రంగా కష్టపడుతుంది. ఇందులో భాగంగానే సేల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఓలా ఈ ఆఫర్లను ప్రకటించినట్లు అర్థమవుతోంది. ఎలాగైనా సేల్స్ విషయంలో మళ్లీ మొదటి స్థానానికి చేరుకోవాలని ఓలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.