ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా మార్కెట్లోకి ఓలా గిగ్ పేరుతో కొత్త స్కూటీని లాంచ్ చేస్తోంది. అత్యంత తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్కూటర్ నడపడానికి లైసెన్స్ కూడా అవసరం లేదు.
రిజిసస్ట్రేషన్ కూడా లేకుండా ఈ స్కూటర్‌ను ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులకు, రోజువారీ పనులకు ఉపయోగించుకునే వారికి ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్‌గా చెబుతున్నారు.
License Free Electric Scooter
ధర విషయానికొస్తే.. ఈ ఓలా గిగ్ కేవలం రూ. 39,999కే అందుబాటులోకి రానుంది. ఇక ఈ స్కూటర్‌ను 250W మోటార్, 1.5 kWh బ్యాటరీ అనే రెండు వేరియంట్స్‌లో రానుంది. ఈ స్కూటర్ 4 నుంచి 5 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారిగా ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 112 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
License Free Electric Scooter
అలాగే ఈ స్కూటర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లను అందించనున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్, డిజిటల్ స్పీడోమీటర్, పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అంతేకాకుండా సీటు కింద మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం ఫీచర్లు ఉండనున్నాయి. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
License Free Electric Scooter
బేసిక్ వేరియంట్‌లో నెలకొన్న పోటీని తట్టుకునే ఉద్దేశంతో ఓలా ఈ స్కూటర్‌ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కూటీని ఓలా అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్కూటర్ ధర రూ. 39,999కి లభిస్తోంది. ఈఎంఐ ఆప్షన్‌తో కూడా ఈ స్కూటీని సొంతం చేసుకోవచ్చు.