Hero HF 100: నెల‌కు జ‌స్ట్ 2 వేల‌తో.. ఈ బైక్ మీ సొంతం చేసుకోండి. 70 కిలోమీట‌ర్ల మైలేజ్

Published : Oct 10, 2025, 02:50 PM IST

Hero HF 100: బైక్ కొనుగోలు చేసే ముందు ఎవ‌రైనా మంచి ఫీచ‌ర్ల‌తో పాటు మైలేజ్‌ను కూడా చూస్తారు. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ మైలేజ్‌తో పాటు మంచి ఫీచ‌ర్లు ఉన్న ఓ బెస్ట్ బైక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
హీరో HF 100 దీపావళి ప్రత్యేక ఆఫర్

దీపావ‌ళి ఆఫ‌ర్‌లో భాగంగా ప్ర‌ముఖ టూవీల‌ర్ సంస్థ హీరో అదిరిపోయే ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. హీరో హెచ్ఎఫ్‌100 బైక్‌ను సొంతం చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఈ బైక్‌ను కేవ‌లం రూ. 10 వేల డౌన్ పేమెంట్‌తో మీ ఇంటికి తీసుకొళ్లొచ్చు. మిగ‌తా మొత్తాన్ని 3 ఏళ్ల‌కు గాను 9 శాతం వ‌డ్డీతో ఈఎమ్ఐ చెల్లించ‌వ‌చ్చు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి డెలివ‌రీ రైడ‌ర్స్‌గా ప‌నిచేసే వారికి ఈ బైక్ ప‌ర్‌ఫెక్ట్ సెట్ అవుతుంది.

25
కొత్త జీఎస్టీతో త‌గ్గిన ధ‌ర

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 త‌ర్వాత హీరో HF 100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 58,739కి త‌గ్గింది. ఇక ఈ బైక్ ఆన్‌రోడ్ ధ‌ర విష‌యానికొస్తే రూ. 70,491గా ఉంది. ఇందులో RTO, బీమా చార్జీలు కూడా ఉన్నాయి. నగరం, డీలర్‌షిప్ ప్రకారం ఆన్-రోడ్ ధర మారవచ్చు.

35
ఇంజిన్, పనితీరు

హీరో HF 100 లో 97.2 cc, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ OHC ఇంజిన్ ఉంది. ఇది 5.9 kW శక్తి, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంట‌కు 90 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇక ఇందులో 9.1 లీట‌ర్ల కెపాసిటీతో కూడిన పెట్రోల్ ట్యాంక్‌ను ఇచ్చారు. ఈ బైక్ స‌గ‌టును లీట‌ర్ పెట్రోల్‌కు 70 కిలోమీట‌ర్ల మైలేజ్ ఇస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఈ బైక్ బ‌రువు కేవ‌లం 110 కిలోలు కావ‌డం విశేషం.

45
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

బైక్ పొడవు 1965 mm, వెడల్పు 720 mm, ఎత్తు 1045 mm. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm, వీల్‌బేస్ 1235 mm, కర్బ్ ఎత్తు 805 mmగా ఉంది. ఇక ముంద‌వైపు 130 mm, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

55
ఏ బైక్‌ల‌కు పోటీనిస్తుందంటే.?

హీరో HF 100 బజాజ్ CT 100, TVS స్పోర్ట్, TVS రేడియన్, హోండా షైన్ 100 వంటి ఎంట్రీ-లెవెల్ 100 cc కమ్యూటర్ బైక్స్ తో పోటీపడుతుంది. దీపావళి సీజన్ ఆఫర్‌, త‌క్కువ‌ EMI ఆప్షన్ల కారణంగా ఈ బైక్ బెస్ట్ ఆప్ష‌న్‌గా నిలుస్తోంది. ఈ బైక్ భారతీయ మార్కెట్‌లో ఎంట్రీ-లెవెల్ కమ్యూటర్ బైక్‌లలో ఉత్తమ ఎంపికగా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories