రూ. 20 వేల‌కే బ‌జాజ్ ప‌ల్స‌ర్ బైక్‌.. ఎలా సొంతం చేసుకోవాలంటే.

Published : Aug 20, 2025, 05:49 PM IST

ప‌ల్స‌ర్ బైక్‌కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా యువ‌తకు ఈ బైక్ ఫెవ‌రేట్‌. అయితే ప్ర‌స్తుతం ప‌ల్స‌ర్ బైక్ కొనుగోలు చేయాలంటే క‌నీసం రూ. ల‌క్ష‌న్న‌ర చెల్లించాల్సిందే. రూ. 20 వేల‌లో ఈ బైక్ సొంతం చేసుకుంటే ఎలా ఉంటుంది? 

PREV
15
పెరుగుతోన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్‌

ప్ర‌స్తుతం మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల‌కు డిమాండ్ పెరుగుతోంది. రోజుకో మోడ‌ల్ వ‌స్తుండ‌డం, కొంగొత్త ఫీచ‌ర్ల‌తో బైక్స్ లాంచ్ అవుతుండ‌డంతో చాలా మంది త‌మ పాత బైక్‌ల‌ను త్వ‌ర‌గా అమ్మేస్తున్నారు. ఇందుకోసం ర‌క‌ర‌కాల ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో బైక్‌వాలే ఒక‌టి. ఇందులో అందుబాటులో ఉన్న ఒక బెస్ట్ డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

25
రూ. 20 వేల‌కే బ‌జాజ్ ప‌ల్స‌ర్

ప్రస్తుతం వ‌స్తున్న ప‌ల్స‌ర్ బైక్స్‌తో పోల్చితే 2010 స‌మ‌యంలో లాంచ్ అయిన బైక్స్ మ‌రింత మెరుగ్గా ఉండేవి. అడ్వాన్స్ ఫీచ‌ర్ల‌ను ప‌క్క‌న పెడితే బైక్ లుక్‌, డిజైన్‌, బాడీ చాలా బ‌లంగా ఉండేది. 2010 బ‌జాజ్ బైక్ బైక్‌వాలాలో రూ. 20 వేల‌కు లిస్ట్ చేశారు. ఈ బైక్ హైద‌రాబాద్‌లో అందుబాటులో ఉంది. ఇంత‌కీ ఈ బైక్‌లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఎన్ని కిలోమీట‌ర్లు తిరిగింది.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

35
బైక్ వివ‌రాలు

2010 బ‌జాజ్ ప‌ల్స‌ర్ 60 వేల కిలోమీట‌ర్లు తిరిగిన‌ట్లు బైక్‌వాలాలో పేర్కొన్నారు. ఈ బండికి కేవ‌లం ఒక య‌జ‌మాని మాత్ర‌మే ఉన్నారు. ఇక ఈ బైక్ స్పార్క‌ల్ బ్లాక్‌లో అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతం ఈ బైక్ ఏజీఎస్ ఆఫీస్‌, హైద‌రాబాద్‌లో ఉంది. 6 రోజుల క్రితం ఈ బైక్‌ను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేశారు.

45
స్పెసిఫికేష‌న్లు

* ఈ బైక్ డిస్‌ప్లేస్‌మెంట్ 178.6 సీసీగా ఉంది.

* మ్యాగ్జిమం ప‌వ‌ర్ 16.76 బీహెచ్‌పీ@8500 ఆర్‌పీఎమ్‌గా ఉంది.

* మ్యాక్స్ టార్క్ 14.52 ఎన్ఎమ్‌@6500 ఆర్‌పీఎమ్‌గా ఉంది.

* ఈ బైక్ గ‌రిష్టంగా గంట‌కు 122 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంది.

* ఇక మైలేజ్ విష‌యానికొస్తే ఈ బైక్ లీట‌ర్‌కు 43 కిలో మీట‌ర్లు ఇస్తుంది.

* ఇందులో 5 స్పీడ్ మ్యానువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌ను ఇచ్చారు.

* ఎయిర్ కూల్డ్ కూలింగ్ సిస్ట‌మ్‌ను అందించారు.

* ఈ బైక్‌లో 12వీ ఫుల్ డీసీ ఎమ్ఎఫ్ బ్యాట‌రీని ఇచ్చారు.

* బీఎస్‌6 ఎమిష‌న్ స్టాండ‌ర్డ్‌తో ఈ బైక్ త‌యారైంది.

55
ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.?

* స్పీడో మీట‌ర్

* ఆడోమీట‌ర్

* ఫ్యూయ‌ల్ గేజ్

* టాకో మీట‌ర్

* లో బ్యాట‌రీ ఇండికేట‌ర్

* లో ఫ్యూయ‌ల్ ఇండికేట‌ర్

* డీఆర్ఎల్ఎస్ లైట్స్‌ను ఇచ్చారు. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం బైక్‌వాలా అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

ఈ విష‌యాలు గుర్తుంచుకోండి.

సెకండ్ హ్యాండ్ బైక్‌ల‌ను కొనుగోలు చేసే స‌మ‌యంలో కొన్ని విష‌యాల‌ను త‌ప్ప‌కుండా గుర్తుంచుకోవాలి. బైక్‌ను కొనుగోలు చేసే ముందు క‌చ్చితంగా ఫిజిక‌ల్‌గా చెకింగ్స్ చేసుకోవాలి. ఫోన్‌లో ఎలాంటి ముంద‌స్తు పేమెంట్స్ చేయ‌కూడ‌దు. దీంతో పాటు ఎలాంటి సెకండ్ హ్యాండ్ బైక్‌ల‌ను కొనుగోలు చేసినా ముందుగా కొన్ని పాయింట్స్‌ను చెక్ చేసుకోవాలి. ఆ పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories