Honda NX200: పిచ్చెక్కించే ఫీచర్లతో హోండా కొత్త బైక్‌.. యువతను తెగ అట్రాక్ట్‌ చేస్తోంది

Published : Feb 17, 2025, 10:10 AM ISTUpdated : Feb 17, 2025, 10:11 AM IST

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మార్కెట్లోకి కొత్త బైక్ ను తీసుకొచ్చింది. హోండా NX200 బైక్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ బైక్ మూడు కలర్స్‌లో లభ్యం అవుతోంది. అడ్వెంచర్ రైడింగ్ అనుభూతిని అందించడానికి దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇంతకీ ఈ బైక్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం... 

PREV
14
Honda NX200: పిచ్చెక్కించే ఫీచర్లతో హోండా కొత్త బైక్‌.. యువతను తెగ అట్రాక్ట్‌ చేస్తోంది
హోండా NX200 లాంచ్

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కొత్త NX200ను లాంచ్ చేసింది. ఈ బైక్ ను ఒకే వేరియంట్ లో తీసుకొచ్చింది. స్పోర్టీ లుక్ కోరుకునే యువతను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ ను అద్భుతంగా రూపొందించారు. ఈ బైక్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,68,499గా నిర్ణయించారు. 

24

దేశవ్యాప్తంగా ఉన్న హోండా అన్ని డీలర్షిప్లలలో ఈ కొత్త బైక్ అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ కస్టమర్ల అంచనాలను కచ్చితంగా అందుకుటుందని కంపెనీ సీఈఓ తెలిపారు. అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఈ బైక్ ఎంతగానో నచ్చుతుందని అన్నారు. 

34
హోండా NX200 ఫీచర్స్

ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్ లో 184.4cc, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజిన్ ను అందించారు. ఈ బైక్ 8500 ఆర్పీఎమ్ వద్ద 12.5 kW శక్తిని, 6000 RPM వద్ద 15.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

44
NX200 బైక్ ప్రత్యేకతలు

ఈ బైక్ ఇంజన్ కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ ను అందించారు. నగరంతో పాటు హైవేలపై మంచి రైడ్ అనుభూతినిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌ లో 12 లీటర్ల కెపాసిటీతో కూడిన పెట్రోల్‌ ట్యాంక్‌ను అందించారు. 184.4 సీసీ ఈ బైక్ సొంతం. బైక్‌ బరువు 147 కిలోలుగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 167 ఎమ్‌ఎమ్‌ ఇవ్వడంతో నగరంలో కూడా రయ్యిమని దూసుకెళ్లొచ్చు. 

click me!

Recommended Stories