ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాట‌రీ మార్చ‌డం క‌ష్ట‌మా.? అపోహ‌లు ఏంటి.? నిజాలు ఏంటి.?

Published : Jun 28, 2026, 08:33 AM IST

Electric Scooter: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయినా వాటి గురించి ఇప్పటికీ కొన్ని అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అలాంటి కొన్ని ప్ర‌ధాన అపోహ‌లు ఏంటి.? అస‌లు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ దూరం ప్రయాణించలేవు

ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఎక్కువగా వినిపించే అపోహ ఇదే. ఒకసారి చార్జ్ చేస్తే కొద్ది కిలోమీటర్లు మాత్రమే వెళ్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రస్తుతం వస్తున్న కొత్త మోడళ్లలో బ్యాటరీ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు VIDA EVOOTER ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 142 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రోజువారీ ఉద్యోగం, వ్యాపారం లేదా నగర ప్రయాణాలకు ఈ రేంజ్ చాలామందికి సరిపోతుంది. బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ దూరం మరింత పెరుగుతోంది.

26
బ్యాటరీ చార్జ్ కావడానికి గంటల తరబడి వేచి ఉండాలి

పెట్రోల్ బంక్‌లో కొన్ని నిమిషాల్లో ఇంధనం నింపేయొచ్చు కాబట్టి, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చార్జ్ చేయాలంటే చాలా సమయం పడుతుందని చాలామంది భావిస్తారు. అయితే ప్రస్తుతం ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉండటంతో ఈ సమస్య చాలా వరకు తగ్గిపోయింది. కొన్ని అడ్వాన్స్‌డ్ స్కూటీల్లో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ కేవలం 62 నిమిషాల్లోనే చార్జ్ అవుతుంది. అలాగే ఇందులో రిమూవబుల్ బ్యాటరీలు ఉండటంతో వాటిని ఇంటికి లేదా కార్యాలయానికి తీసుకెళ్లి సౌకర్యవంతంగా చార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు.

36
ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా ఖరీదైనవి

ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు ధర ఎక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ కొనుగోలు ధర మాత్రమే కాకుండా మొత్తం నిర్వహణ ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్ర‌స్తుతం బేసిక్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ధ‌ర రూ.44,990 నుంచి ప్రారంభమవుతోంది. ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత పెట్రోల్ ఖర్చు ఉండదు. ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం ఉండ‌దు. సర్వీసింగ్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. అదనంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం అందించే సబ్సిడీలు కూడా వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తున్నాయి. దీర్ఘకాలంలో చూస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగం ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది.

46
ఎలక్ట్రిక్ స్కూటర్లు సురక్షితం కావు

బ్యాటరీలకు సంబంధించిన కొన్ని సంఘటనల కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త మోడళ్లలో అధునాతన భద్రతా సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. కొన్ని స్కూటీల్లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, వివిధ రైడింగ్ మోడ్స్, స్మార్ట్ కంట్రోల్ ఫీచర్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. సరైన నాణ్యత ప్రమాణాలతో తయారైన వాహనాలను ఉపయోగిస్తే భద్రత విషయంలో ఆందోళన అవసరం ఉండదు.

56
బ్యాటరీ మార్చాలంటే భారీ ఖర్చు అవుతుంది

ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ మార్పిడి చాలా ఖరీదైన వ్యవహారమని కొందరు భావిస్తారు. కానీ బ్యాటరీ జీవితకాలం చాలా సంవత్సరాలు ఉంటుంది. కొన్ని సంస్థలు బ్యాటరీలకు మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు ఐదు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ఎంపికను కూడా అందిస్తోంది. పైగా పెట్రోల్, ఇంజిన్ ఆయిల్, ఇతర నిర్వహణ ఖర్చుల్లో ఆదా అయ్యే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్యాటరీ మార్పిడి ఖర్చు పెద్ద భారం కాదని చెప్పవచ్చు.

66
ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉన్నాయి

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఒకప్పుడు ఛార్జింగ్ స్టేషన్ల కొరత పెద్ద సమస్యగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్ర‌స్తుతం అన్ని ప్ర‌ముఖ సంస్థ‌లు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. అదనంగా ఇంట్లోనే చార్జ్ చేసుకునే అవకాశం ఉండటంతో ఛార్జింగ్ కోసం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories